వారంలోనే ‘ క‌స్ట‌డీ ‘ దుకాణం బంద్‌… నాగ‌చైత‌న్య ముంచింది ఎన్ని కోట్లో చూస్తే ఏడుపొక్క‌టే త‌క్కువ‌…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోల్లో అక్కినేని నాగ చైతన్య కూడా ఒక‌రు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చిన చైత‌న్య‌.. కష్టపడేతత్వంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. దీనికితోడు కొన్ని విజయాలను కూడా సొంతం చేసుకుని స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. అయితే ఇటీవ‌ల‌ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న చైతన్య.. ఇటీవలే ‘కస్టడీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Custody (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

అక్కినేని నాగ చైతన్య – వెంకట్ ప్రభు కాంబోలో వ‌చ్చిన‌ యాక్షన్ సినిమానే క‌స్టడీ. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మించారు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా.. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా విడుద‌లైన మొద‌టి రోజు నుంచే భారీ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకుంది.

ఈ ఫ్లాప్ టాక్‌తో ఈ సినిమాకు మొద‌టి రోజు నుంచే అశించిన క‌లెక్ష‌న్లు రాలేదు. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల లోపే చాలా చోట్ల రన్‌ను కూడా ముగించేసింది. అదే సీన్ ప్రపంచ వ్యాప్తంగా కూడా కనిపించింది. దీంతో నాగ చైతన్య ఖాతాలో మరో భారీ ఫ్లాప్ పడినట్లైంది. రూ.22 కోట్ల బిజినెస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన క‌స్ట‌డీ ఈ వారం రోజులో కేవ‌లం రూ.6 కోట్ల రూపాయల షేర్‌ మ‌త్ర‌మే రాబ‌ట్టింది.

OTT debut of Akhil's Agent delayed? | 123telugu.com

అంటే చైతు ఏకంగా రు. 16 కోట్ల‌కు అంద‌రిని ముంచేశాడు. దీంతో ఈ సినిమా పై మ‌రో ర‌చ్చ కూడా వ‌స్తుంది. కస్ట‌డి సినిమా క‌న్నా ముందు మ‌రో అక్కినేని హీరో అఖిల్ న‌టించిన ఏజెంట్ కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా కూడా టాలీవుడ్‌లోనే భారీ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు క‌స్ట‌డి సినిమా కూడా ప్లాప్ అవ్వ‌డంతో అక్కినేని బ్రదర్స్ ఇద్దరు నిర్మాతలను నిండా ముంచేశారు.