బాలీవుడ్ స్టార్ యాక్టర్ శిల్పా శెట్టి సినిమాలతో మంచి పాపులారి దక్కించుకుంది. ఇక ఈమె ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్షియల్ కంటెంట్ లో ఇరుక్కుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. దీంతో భారీగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కు గురయ్యే శిల్ప కొన్నిసార్లు సైలెంట్ అయిపోయిన కొన్నిసార్లు మాత్రం ట్రోలర్స్ కు గట్టి సమాధానం ఇస్తూ ఉంటుంది.
అలాగే ఇటీవల ఆమెపై జరిగిన ట్రోలింగ్స్ కు ఘాటుగా స్పందించింది శిల్ప. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా తన నివాసంలో జాతీయ జెండా ఎగరవేసిన శిల్పా ఆ ఫ్లాగ్ హోస్టింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో శిల్పా చెప్పులు వేసుకుని ఫ్లాగ్ హోస్టింగ్ చేయడంతో ఆమెపై భారీగా ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఈసారి ఆ ట్రోలింగ్స్ కు చెక్ పెట్టాలనుకున్న శిల్ప ఘాటుగా స్పందించింది.
ఫ్లాగ్ హోస్టింగ్ టైంలో పాటించాల్సిన నిబంధన గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. చెప్పులేసుకోకూడదన్న నియమం ఫ్లాగ్ కోడ్ లో ఎక్కడ ఉండదు అంటూ ఆమె స్పష్టం చేసింది. ఆమె వాదనన్ను నిజమని ప్రూవ్ చేసేందుకు గూగుల్లో ఆర్టికల్ వెతికి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూర్తిగా అవగాహన లేకుండా ట్రోల్ చేయడం ఆమెకు నచ్చలేదని వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే ఏదైనా రాయండి అంటూ మందలించింది.