బ్రహ్మముడి (ఆగస్టు 16): కావ్య పై పొగడ్తలు కురిపించిన దుగ్గిరాల ఫ్యామిలీ పెద్దవాళ్లు….. స్వప్న ప్రెగ్నెన్సీ…. రాజ్ అంతరాత్మ తిప్పలు…..!!

కావ్య ఈ వీడియోని తీసుకెళ్లి తాతయ్య గారికి చూపించాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి అని రాజ్ ని అడుగుతుంది. రాజ్ ఆ వీడియో డిలీట్ చేయాలంటే ఎంత డబ్బు తీసుకుంటావో చెప్పు అని కావ్యాని అంటాడు. నన్ను డబ్బుతో కొనలేరు అవసరం వచ్చినప్పుడు చెబుతాను అని కావ్య అంటుంది. రాజ్ అవసరం ఎప్పుడొస్తుంది అని అడుగుతాడు. అప్పుడప్పుడు వస్తుంది అని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. అప్పు, కళ్యాణ్ తనుకు ఫోన్ చేసిన అమ్మాయి ఇల్లు కనుక్కోవడానికి వెళ్తారు. కళ్యాణ్ ,అప్పు.. పిచ్చేశ్వరరావు దగ్గరికి వెళతారు. తను కళ్యాణ్ నీ చూసి మందులు డోస్ పెంచాల్సిందే అంటాడు. కళ్యాణ్ నాకేమీ జబ్బు లేదు అంటాడు. పిచ్చేశ్వరరావు అది చెప్పాల్సింది నేను అని అంటాడు. ఆ డాక్టర్ కళ్యాణ్ కి ఓ లెటర్ ఇస్తాడు.

ఓ పిచ్చి అబ్బాయి నా నెంబర్ నుంచి ఫోన్ చేస్తానని ఎలా అనుకున్నావు ఈ అడ్రస్ కనిపెట్టినట్లే నా నెంబర్ కూడా కనిపెట్టు అని రాసి ఉంటుంది. కావ్య వాళ్ళ అమ్మమ్మ ,తాతయ్య దగ్గరికి వెళ్లి ఈ ఇల్లు ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మీరే. అలాగే ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కూడా కారణం మీరే నేను మా పుట్టింటికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి తాతయ్య, అమ్మమ్మ అంటుంది. అప్పుడు కావ్య వాళ్ళ బామ్మ గారు, కంటే కూతుర్నే కనాలి అని ఎవరన్నారో కానీ నిన్ను చూస్తుంటే అది నిజమనిపిస్తుంది అని కావ్యని పొగుడుతుంది. కావ్య వాళ్ళ తాతయ్య కావ్యని డ్రాప్ చేయమని రాజ్ కి చెబితే అపర్ణ కోప్పడుతుంది.

చివరికి రాజ్ నే తీసుకు వెళతాడు. రాజ్ ఆత్మ కావ్య ని ముద్దు పెట్టుకోవడానికి చూస్తుంది దాంతో రాజ్ దాన్ని కొట్టబోయి కావ్యాన్ని కొడతాడు. అలా వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. స్వప్న ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటుంది సింగిల్ టిక్ వచ్చిందేంటని తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడుగుతుంది మీరు కలిసి రెండు రోజులే అవుతుంది వెయిట్ చేయాలి అప్పుడే కన్ఫర్మ్ అవ్వదు స్వప్న అని తన ఫ్రెండ్ చెబుతుంది. వెంటనే తెలిసే టెస్ట్ ఏదైనా ఉంటే చెప్పు సాక్షి అని అడుగుతుంది. అలాంటిదేమీ ఉండదు అని తన ఫ్రెండ్ చెబుతుంది. వెయిట్ చేయాలంట వెయిట్ చేస్తే ఎవరికైనా తెలిస్తే ఎంత గొడవ అవుతుందో తనకేం తెలుసు నా బాధ అని స్వప్న మనసులో అనుకుంటుంది.

రాహుల్ వచ్చి ఇందాక ఎందుకువచ్చి నా మీద అరిచావు అని స్వప్న ని అడుగుతాడు. రాజ్‌ లాగా నన్ను పట్టించుకుంటున్నావా రాజ్ మా చెల్లిని పుట్టింటికి దింపడానికి వెళ్ళాడు. నువ్వు ఉన్నావు ఏం పట్టించుకోవు అని స్వప్న రాహుల్ ని అంటుంది. అసలు ఇదంతా నీ వల్లే ఆరోజు రిసార్ట్‌లో మ‌నిద్దరం కలవకపోయి ఉంటే నాకు ఇంట్లో గౌరవం ఉండేది అని రాహుల్ స్వప్న మీద అరుస్తాడు. కావ్య ఏవండీ ఉప్మా జీడిపప్పు వేశానండి అంటుంది.. రాజ్ నేను ఉప్మా తినను అంటాడు. ఇంతలోగా రాజ్ మట్టిలో కాలు వేస్తాడు. ఏంటమ్మా ఇది అని కనకం అడుగుతుంది. కావ్య మా ఆయన ఏదైనా మంచి పని చేయాలంటే ముందుగా తన చేతుల మీదే చేస్తారు అని చెబుతోంది. కావ్య రాజ్ బొమ్మల కోసం మట్టి తొక్కుతూ ఉంటారు. ఇంతలోగా దీని వీడియో తీసి అపర్ణాకి రుద్రాన్ని చూపిస్తుంది. దీంతో అపర్ణ కోపంగా ఉంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.