Trivikram : ఆ హీరోయిన్ ని వదలని గురూజీ..!

ఒక సినిమా హిట్ అయితే ఆ డైరక్టర్ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా ఉంటాయి. ఒక సినిమాలో హీరోయిన్ బాగా నటించడం వల్లే సినిమా హిట్ అయ్యిందని నమ్మితే ఆ హీరోయిన్ నే రిపీట్ చేస్తుంటారు డైరక్టర్స్. ఇక హీరోయిన్ తో ర్యాపో బాగుంటే కూడా హీరోయిన్ ని అసలు వదలరు. ప్రస్తుతం అలానే మళయాళ ముద్దుగుమ్మ సం యుక్త మీనన్ ని త్రివిక్రం శ్రీనివాస్ (Trivikram) వదలట్లేదని తెలుస్తుంది.

ఆయన పర్యవేక్షణలో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో ఆమెని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమాలో ఆమె అభినయం చూసి మెచ్చిన త్రివిక్రం (Trivikram) తన డైరక్షన్ లో చేస్తున్న సినిమాలో కూడా ఆమెని రిపీట్ చేస్తున్నాడు. భీమ్లా నాయక్ తర్వాత సం యుక్త మీనన్ నటించిన బింబిసార సినిమా కూడా హిట్ అవడంతో ఆమె లక్కీ హీరోయిన్ అయ్యింది.

ఈ క్రమంలో త్రివిక్రం సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న సినిమాలో ఆమెని సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుంది. పూజాతో కూడా త్రివిక్రం ఇది మూడవ సినిమా. ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమాలో కూడా పూజా నటించగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో కూడా బుట్ట బొమ్మ అలరించింది.

Tags: Heroine, mahesh, Pooja Hegde, Samyukta Menon, SSMB28, Tollywood, trivikram