BiggBoss : బిగ్ బాస్ 6 ఆరోజు నుంచి స్టార్ట్.. ఆడియెన్స్ గెట్ రెడీ..!

ఐదు సూపర్ సక్సెస్ ఫుల్ సీజన్ లను పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 6 కి రెడీ అవుతుంది. ఐదవ సీజన్ అయ్యాక బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఒక ప్రయత్నం చేశారు. అది అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అవలేదు. అందుకే బిగ్ బాస్ 6కి మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సీజన్ లో స్టార్ సెలబ్రిటీస్ ఉండబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే సీజన్ 6 లో కంటెస్టంట్స్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

ఇక ఈ సీజన్ కోసం నాగ్ భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 6 (BiggBoss) కోసం నాగార్జున 18 కోట్ల దాకా ఛార్జ్ చేస్తున్నట్టు టాక్. బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. 16 మంది కంటెస్టంట్స్ తో ఆట మొదలు కానుంది.

సీజన్ 6 లో ఇదివరకు ఎప్పుడూ చూడని టాస్క్ లు.. షో ని సూపర్ ఎంటర్టైనింగ్ గా చేసేలా కొన్ని స్పెషల్ ఏర్పాట్లు చేస్తున్నారట. తప్పకుండా BiggBoss సీజన్ 6 అన్ని సీజన్ల కన్నా బెస్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Tags: BB Season 6, BiggBoss 6, BiggBoss Telugu, nagarjuna, Star Celebrities, Star Maa, Tollywood