Vijay Devarakonda : విజయ్ దేవరకొండతో నటించనని చెప్పిన స్టార్ హీరోయిన్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఛాన్స్ వస్తే ఎవరైనా కాదంటారా చెప్పండి. కాని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఒక హీరోయిన్ మాత్రం విజయ్ దేవరకొండ సినిమా ఛాన్స్ వచ్చినా సరే చేయనని చెప్పిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ఫిదా భామ సాయి పల్లవి అని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాలో ముందు సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని డైరక్టర్ భరత్ కమ్మ అనుకున్నారట.

కానీ ఆ సినిమాలో లిప్ లాక్ సీన్ ఉందని ఆ మూవీ చేయనని చెప్పిందట సాయి పల్లవి. ఇదే కాదు ఫ్యూచర్ లో కూడా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో సినిమా చేయనని కూడా అన్నదట. హీరోయిన్ అన్న తర్వాత అందరి హీరోలతో చేయాలి కేవలం కొంతమందితోనే చేస్తానని లిమిటేషన్స్ పెట్టుకోకూడదు. ఆ హీరోతో అయినా తన క్యారక్టర్ కి తగినట్టుగా పాత్రని ఎంచుకుంటే బెటర్.

ఇక ఇదిలాఉంటే సాయి పల్లవి మాత్రం ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలను చేస్తూ వస్తుంది. లేడీ పవర్ స్టార్ ట్యాగ్ తో అమ్మడు టాలీవుడ్ లో దూసుకెళ్తుంది.

Tags: Dear Comrade, Sai Pallavi, Star Heroine, Tollywood, vijay, Vijay Devarakonda