అల్లు అర్జున్ కొత్త టీవీ యాడ్ …డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య ఎక్కువ సమయం సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉంటూ అతను బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కోసం షూటింగ్‌లలో నిమగ్నమై ఉంటున్నాడు .ఇటీవల బన్నీ ఒక టెలివిజన్ వాణిజ్య ప్రకటన కోసం యాడ్ చేసాడు. ఈ యాడ్ చిత్రీకరించింది మరెవరో కాదు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.అయిన అల్లు అర్జున్ కూల్ మరియు ట్రెండీ దుస్తులలోకనిపిస్తున్నాడు.

ఈ యాడ్ షూట్ కోసం మొదట అల్లు అర్జున్ షూటింగ్ స్పాట్‌కు ప్రింటెడ్ షర్ట్ మరియు బ్లాక్ ట్రౌజర్‌లో చాలా సింపుల్‌గా వచ్చాడు.దానికి తోడుగా టోపీ మరియు కళ్లద్దాలుతో ఎరుపు రంగు జాకెట్, గ్రే వాష్డ్ డెనిమ్ మరియు వైట్ స్నీకర్స్ ధరించి స్టైలిష్ లుక్‌లో కనబడుతున్నాడు.

ఈ ఫొటోస్ బన్నీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవగానే లైక్‌లు ,కామెంట్స్తో నిండిపోయాయి. ఇటీవలి కాలంలో బన్నీ అనేక బ్రాండ్‌లకు సంతకం చేశాడని ,మరిన్నిబ్రాండ్స్ లైన్‌లో ఉన్నాయంట.

Tags: allu arjun, allu arjun tv ads, directir trivikram