చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ …రెండు గంటలు పైగా చర్చలు !

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి మళ్లీ వేగంగా రాజుకుంటోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్న తరుణంలో రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను రేపుతున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు మోహన్ బాబు హైదరాబాద్‌లోని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.

రెండు గంటల పాటు పలు కీలక అంశాలపై ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా వీరిద్దరూ చర్చించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మీటింగ్ యొక్క ఉద్దేశ్యం ఇంకా తెలియాల్సి ఉంది.

మోహన్ బాబు సీఎం జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు కావడంతో మోహన్ బాబు, చంద్రబాబుల భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు మంచు జగన్ చెల్లెలు విరానికాను వివాహం చేసుకున్నారు.

మోహన్ బాబు 2019 ఏప్రిల్ సాధారణ ఎన్నికలకు ముందు మార్చి 2019లో మోహన్ బాబు YSRCP చేరాడు.ఆ సందర్భంగా మోహన్ బాబు చంద్రబాబుపై ఘాటు విమర్శలు గుప్పించారు. కాబట్టి, వీరిద్దరి మధ్య ప్రస్తుత సమావేశం చాలా క్యూరియాసిటీని కలిగిస్తుంది.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు మోహన్‌బాబు విధేయుడిగా వ్యవహరించడం అందరకి తెలిసిన విషయమే . గతంలో మోహన్ బాబు, చంద్రబాబు ఇద్దరూ ఎన్టీఆర్ నాయకత్వంలో పనిచేశారు. మోహన్ బాబు టీడీపీ రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. అయితే ఎన్టీఆర్ తర్వాత ఆయన చంద్రబాబుకు, టీడీపీకి దూరమయ్యారు.

మోహన్ బాబు మళ్లీ వారం తర్వాత చంద్రబాబుతో భేటీ కానున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భేటీ ఇంక్కేన్ని రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తదో వేచి చూడాలి .

Tags: andhrapradesh, chandrababu naidu, mohanbabu, tdp, YS Jagan, ysrcp