టాలీవుడ్ స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అంతా సెట్ చేసే పనిలో బిజిగా ఉన్నారు. మాటల మాంత్రికుడ్ని కూడా సెట్ చేస్తున్నాడని ఇప్పుడు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ అలా వైకుంఠపురములో సినిమా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంతా తానై చూసుకుంటున్నాడని టాక్. అందుకే బన్నీ ముందు మాటల మాంత్రికుడు మూగబోయాడని.. అంతా బన్నీ కనుసన్నల్లోనే సినిమా వర్క్ జరుగుతుందని వినికిడి.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో అలా వైకుంఠపురములో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానున్నది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ సినిమా చేసినా పక్కాగా.. ఓ ప్లాన్ ప్రకారం చేస్తారనే టాక్ ఉంది. అయితే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన అజ్ఞాతవాసి డిజాస్టర్ అయింది. దీంతో మాటల మాంత్రికుడిపై బన్నీ కొంత అపనమ్మకం పెట్టుకున్నట్లు వినికిడి. అందుకే ఈ సినిమా కు అల్లు అర్జున్ సైన్ చేసినప్పటి నుంచి అంటే సినిమా స్క్రిప్ట్ నుంచి.. సినిమా విడుదల వరకు అన్నీ తాను అనుకున్నట్లే పనులు చేయించుకుంటున్నాడని టాక్.
అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పాటలు విడుదల చేయడం, టీజర్ విడుదల, ఫోస్టర్‌లు, ఫ్రీ రిలీజ్ బిజినెస్, ఇప్పడు జరుగబోతున్న ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ వరకు అన్ని తాను అనుకున్న మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేత చేయించుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. మాటల మాంత్రికుడు బన్నీ ముందు మాటలు రాని మూగవాడుగా మిగిలిపోయాడని.. అల వైకుంఠపురములో సినిమా అంతా బన్నీ కనుసన్నల్లోనే చిత్రీకరణ జరిగిందని టాక్.