యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ పుణ్యమా అని మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆలస్యం అయింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెగాస్టార్ చిరు సినిమా ఆలస్యం కావడానికి హీరో రాజశేఖర్ ఎందుకు కారణమయ్యాడో తెలిస్తే అంతా షాక్ తినాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న152వ చిత్రంకు రాజశేఖర్ ఎఫెక్ట్ పడింది. అందుకే ఈనెల 2న షూటింగ్ జరుపుకోవాల్సిన ఈ చిత్రం ఒకరోజు ఆలస్యంగా షూటింగ్ మొదలయ్యింది.
ఇంతకు ఏమీ జరిగిందనే కదా మీ అనుమానం.. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో 152వ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఈనెల 2న ప్రారంభించేందుకు సర్వం సిద్దం చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా షూటింగ్‌కు వెళ్ళలేక పోయాడు. దీంతో ఆ రోజున షూటింగ్‌ను క్యాన్సిల్ చేశారు దర్శకుడు శివ. షూటింగ్ మొదటి రోజున మెగాస్టార్ చిరంజీవితో పాటు రెండో హీరోయిన్‌గా ఎంపికైన రెజినాలపై ఓ పాటను షూట్ చేయాల్సి ఉండే.
హీరోయిన్ రెజినా షూటింగ్ స్పాట్‌కు అనుకున్న సమయానికి వచ్చింది. కానీ హీరో మెగాస్టార్ చిరంజీవి రాలేకపోయారు. దీంతో షూటింగ్ జరుగలేదు. కారణమేమంటే.. మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా హీరో డాక్టర్ రాజశేఖర్ మెగాస్టార్‌పై అనుచిత వ్యాఖ్యాలు చేయడం.. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ దురుసుగా ప్రవర్తించడంతో మెగాస్టార్‌కు కలతకు గురయ్యాడు. దీంతో చిరు అప్‌సెట్ అయి చిత్ర షూటింగ్‌కు వెళ్ళలేక పోయాడు. ఇలా రాజశేఖర్ చేసిన వ్యవహరం మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి కారణమైంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.