Trisha : ఆ హీరోపై త్రిష స్పెషల్ ఇంట్రెస్ట్.. ఎప్పటికీ ప్రత్యేకం అంటూ కామెంట్..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) తమిళ స్టార్ హీరో విజయ్ గురించి స్పెషల్ కామెంట్స్ చేసింది. విజయ్ తనకి బెస్ట్ కో స్టార్ అని ఆయన చాలా ప్రత్యేకమని.. పని పట్ల చాలా అంకిత భావంతో ఉంటారని చెప్పుకొచ్చింది. ఇంతకీ సడెన్ గా విజయ్ మీద త్రిషకి అంత ప్రేమ ఎందుకు అంటే విజయ్ 67వ సినిమాలో త్రిష ఆయనతో జత కడుతుంది.

లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో దళపతి విజయ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రస్తుతం విజయ్ వారసి సినిమా షూటింగ్ లో ఉన్నాడు. అది పూర్తి కాగానే విజయ్ 67వ సినిమా వస్తుంది. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా సమంత కూడా ఉంటుందని తెలుస్తుంది.

అయితే సమంత ఇందులో నెగటివ్ రోల్ లో కనిపిస్తుందట. సినిమాలో ఆరుగురు విలన్లు ఉంటారని వారిలో సమంత కూడా ఒక నెగటివ్ రోల్ లో నటిస్తుందని కోలీవుడ్ టాక్. మొత్తానికి 14 ఏళ్ల తర్వాత త్రిష (Trisha) విజయ్ తో నటించే ఛాన్స్ అందుకుంది.

Tags: Kollywood, Lokesh Kanagaraj, Thalapathy Vijay, Trisha, Trisha Krishnan, Vaarasi, Varasudu, vijay, Vijay 67