NTR : స్టూడెంట్ నెంబర్ 1 హీరోగా ముందు అతన్ని అనుకున్నారా.. ఎన్.టి.ఆర్ కి ఆ ఛాన్స్ ఎలా వచ్చింది..!

రాజమౌళి డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ (NTR) హీరోగా వచ్చిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా వెనక జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని ఆ సినిమా నిర్మాత వైజయంతి బ్యానర్ అధినేత అశ్వనిదత్ చెప్పుకొచ్చారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా కథ అనుకున్నప్పుడు అది ప్రభాస్ తో చేయాలని అనుకున్నారట. అయితే హరికృష్ణ ఫోన్ చేసి ఎన్.టి.ఆర్ తో ఆ సినిమా చేయాలని అడిగారట.

అప్పటికే నిన్ను చూడాలని సినిమా చేసిన తారక్ ని చూసి జక్కన్న ఓకే చెప్పడంతో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఎన్.టి.ఆర్ (NTR) చేయాల్సి వచ్చింది. ఆ సినిమా ఎన్.టి.ఆర్ చేయడం వల్ల సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. అఫ్కోర్స్ ప్రభాస్ చేసినా కూడా హిట్ అయ్యేది కానీ దాని ఇంప్యాక్ట్ వేరేలా ఉండేది.

ఏది ఏమైనా ప్రభాస్ చేయాల్సిన ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు మన తారకరాముడు. ఆ సినిమాతో మొదలైన రాజమౌళి ఎన్.టి.ఆర్ ల కాంబో మళ్లీ మళ్లీ అద్భుతాలు చేస్తూనే ఉంది.

Tags: Aswanidutt, ntr, Prabhas, rajamouli, Student No 1, Tollywood