Trisha : రాజకీయాల్లోకి స్టార్ హీరోయిన్.. త్వరలోనే బిగ్ ఎనౌన్స్ మెంట్..!

సినిమా వాళ్లు పాలిటిక్స్ లోకి వెళ్లడం ఇప్పుడు చాలా కామన్ అయ్యింది. తమకున్న స్టార్ క్రేజ్ రాజకీయాల్లోకి వెళ్లి ప్రజలకు మరింత మంచి చేయాలని వస్తున్నారు. ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీస్ పాలిటిక్స్ లో తమ సత్తా చాటగా లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్ధాలుగా ఆమె తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికీ వరుస సినిమాలతో సత్తా చాటుతున్నTrisha రాజకీయాల్లోకి రావాలని అనుకుంటుందట. తన సన్నిహితులతో తన పొలిటికల్ ఎంట్రీ పై చర్చించిందని తెలుస్తుంది.

తమిళనాడు మాజీ సిఎం జయలలిత కూడా ఒకప్పుడు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అంతకుముందు లేడీ సూపర్ స్టార్ నయనతార రాజకీయాల్లోకి వెళ్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు నయన్ ప్లేస్ లో త్రిష పేరు వినిపిస్తుంది.

Tags: politics, Star Heroine, Trisha, Trisha Krishnan, Trisha Updates