బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ (Janhvi kapoor) ఓ పాన్ ఇండియా సినిమా ఛాన్స్ ని మిస్ చేసుకుంది. త్వరలో రిలీజ్ అవబోతున్న ఆ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ సినిమా డైరక్టర్ మూవీలో హీరోయిన్ గా ముందు జాన్వినే అనుకున్నామని కానీ ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో వేరే హీరోయిన్ ని తీసుకున్నామని అన్నారు.
ఇంతకీ జాన్వి (Janhvi kapoor) మిస్ అయిన సినిమా ఏది అంటే రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ లైగర్ అని తెలుస్తుంది. పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో భారీ అంచనాలతో ఈ సినిమా వస్తుంది. సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా ప్రమోషన్స్ లో డైరక్టర్ పూరీ జగన్నాథ్ హీరోయిన్ గా జాన్విని తీసుకోవాలని అనుకున్నా సరే ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని చెప్పేసరికి మరో నిర్మాత కరణ్ జోహార్ సజెషన్ తో అనన్యా పాండేని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నామని చెప్పారు.
విజయ్, అనన్యా పాండేల జోడీ అదిరిపోయింది. లైగర్ సినిమాకు వీరి జోడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. ముంబై హీరోయిన్స్ ని తెలుగు తెరకు పరిచయం చేయడం పూరీకి అలవాటే. పూరీ సినిమాతో తెరంగేట్రం చేసిన వారు తెలుగులో టాప్ రేంజ్ కి వెళ్లిన వారు ఉన్నారు.