Trisha : అందాల భామ త్రిష ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నటించింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిషతో పాటు ఐశ్వర్యా రాయ్ కూడా హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరోలతో పాటుగా హీరోయిన్స్ కూడా పాల్గొంటున్నారు. పిఎస్ 1 హీరోలు విక్రం, జయ రవి, కార్తీలతో పాటుగా త్రిష కూడా అన్ని ఇంటర్వ్యూస్ లో కనిపిస్తుంది. అయితే అన్నిచోట్ల త్రిష నే స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది.
దాదాపు తెరంగేట్రం చేసి రెండు దశాబ్ధాలు అవుతున్నా ఇంకా త్రిష తన గ్లామర్ తో మెప్పిస్తుంది. పిఎస్ 1 ప్రమోషన్స్ లో అందరి కళ్లు త్రిష మీదే ఉందని చెప్పొచ్చు. పిఎస్ 1 ప్రమోషన్స్ లో త్రిష శారీ లుక్ తోనే కనిపిస్తున్నా అమ్మడి అందాలకు ఆడియన్స్ అంతా కూడా ఫిదా అవుతున్నారు. అంతేకాదు త్రిష ఉన్న వీడియోలకు కామెంట్స్ గా త్రిష నీ బ్యూటీ సీక్రెట్ ఏంటి.. త్రిషా ఏంటి నీ అందం నన్ను డిస్ట్రబ్ చేస్తుంది అంటూ రాసుకొస్తున్నారు.
ఏది ఏమైనా త్రిష గ్లామర్ పి.ఎస్ 1 ప్రమోషన్స్ కి స్పెషల్ బజ్ తీసుకొచ్చింది. కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న త్రిష తెలుగులో ఒకటి రెండు ఆఫర్లు వస్తున్నా వేరే కమిట్ మెంట్ల వల్ల కాదని అంటుంది. మరి త్రిష తెలుగులో సినిమా ఓకే చేస్తుందా లేదా అన్నది చూడాలి. అసలైతే ఆచార్య సినిమాలో త్రిష నటించాల్సి ఉన్నా ఏవో కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యింది.