Lokulu Kakulu Aunty : ఐమ్యాక్స్ దగ్గర సినిమా రివ్యూ చెబుతూ పాపులర్ అయ్యింది లోకులు కాకులు ఆంటీ. ఆమె మాట్లాడే విధానానికి జనాలు కూడా సపోర్ట్ చేయడంతో ఆమె కూడా ఓ చిన్నపాటి సెలబ్రిటీగా మారింది. అయితే అడపాదడపా ఈటీవీ షోలలో కనిపిస్తుంది లోకులు కాకులు ఆంటీ. రీసెంట్ గా జబర్దస్త్ లో ఆటో రాం ప్రసాద్ టీం లో కనిపించి సర్ ప్రైజ్ చేసింది.
గెటప్ శ్రీను ఆమెలానే గెటప్ వేసి అలరించాడు. గెటప్ శ్రీను వర్సెస్ లోకులు కాకులు ఆంటీ ఎపిసోడ్ తో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ ఎపిసోడ్ కోసం ఆమెని పిలిచి అవమానించారని టాక్. అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆమె చాలా మోసపోయిందని అంటున్నారు. మాములుగా అయితే ఆమెని ఏ షోకి పిలిచినా సరే 5000 రూపాయలు తీసుకుంటుంది.
జబర్దస్త్ ఆటో రాం ప్రసాద్ కూడా ముందు ఆమె అడిగినంత ఇస్తానని చెప్పి తీరా షో అయిపోయాక 2000 చేతిలో పెట్టి మల్లెమాల వారు ఇదే ఇచ్చారని చెప్పాడట. అయితే తెచ్చింది రాం ప్రసాద్ కాబట్టి అతనికి ఇచ్చే ఎమౌంట్ నుంచి ఆమెకు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా లోకులు కాకులు ఆంటీని ఇబ్బంది పెట్టారట. దీనిపై ఆమె తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడ్డదని తెలుస్తుంది.