త్రిబుల్ ఆర్ అంటే రాజమౌళి సినిమా కాదు.. ఈ పేరు వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటో మీకు తెలుసా..!

మ‌న తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆర్ ఆర్ ఆర్ అంటే చాలామందికి సినిమా పేరు గుర్తుకొస్తుంది. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా పేరు చెప్పగానే రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్ చరణ్ పేర్లు గుర్తుకు వస్తాయి. అయితే మనకి ఇది సినిమాగానే తెలుసు కానీ త్రిబుల్ ఆర్ అని సీనియర్ ఎన్టీఆర్ కాలంలోనే ఆ ముగ్గురిని ఆర్ ఆర్ ఆర్ అనీ పిలిచేవారట. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఇక్కడ చూద్దాం.

తాజాగా ఎన్టీఆర్ వంద రూపాల నాణెం విడుదల చేసిన సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో ముగ్గురు సినీ దిగ్గజాలు కలిసి భోజనం చేస్తున్నారు. వీరంతా కలిసి ఒక వివాహ వేడుకకు వెళ్లి వరుసగా కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో తీసిన ఫోటో అది. ఇందులో ఎన్టీఆర్ కాషాయ రంగు దుస్తుల్లో ఉన్నారు. ఆ వివాహ వేడుకకు ఆయన రావడంతో ఆయన చుట్టూ చాలామంది గుమికూడారట.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్, రామానాయుడు, రాఘవేంద్రరావు వరుసగా కూర్చొని భోజనాలు చేస్తూ కనిపించడం విశేషం. అయితే అప్పట్లో వీరిని త్రిబుల్ ఆర్ అని పిలిచేవారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతూ ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.