ప‌స్ట్ బొమ్మ పడకుండానే నాలుగు సినిమాలు.. ఎన్టీఆర్ బావ‌మ‌రిదా మజాకా..!

చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోలు ఎంట్రీ ఇవ్వడంతోనే వరుస అవకాశాలు అందుకుంటారు. తమ సత్తా చూప‌టడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఇలా జూనియర్ ఎన్టీఆర్ బావామ‌రిది అనే బ్రాండ్ తో టాలీవుడ్ లో హీరోగా అడుగుపెడుతున్న మరో యంగ్ హీరో నార్నె నితిన్.. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడైన ఈ కుర్రోడు హీరోగా సక్సెస్ కావడానికి తనకు కావాల్సిన అన్ని మెళుకువలని నేర్చుకుని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇక తన మొదటి సినిమా అని సతీష్ వేగేశ్న‌ డైరెక్షన్లో శ్రీశ్రీశ్రీ రాజావారు అనే మూవీని గత ఏడాది మొదలుపెట్టారు.. ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బయటకు వచ్చింది. ఇక అందులో మాస్ లుక్ తో గెడ్డంతో అదిరిపోయే లుక్ లో ఉన్నాడు నితిన్.. తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. షూటింగ్ పూర్తయిందని అంటున్న సినిమా విడుదలపై క్లారిటీ లేదు.. అయితే మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఈ యంగ్ హీరోతో సినిమాలు చేయడానికి బడా ప్రొడక్షన్ హౌస్‌లు ముందుకుు వచ్చాయి.

వాటిలో సితార ఎంటర్టైన్మెంట్స్, గీత ఆర్ట్స్ 2, మైత్రి మూవీ మేకర్స్ కూడా ఎన్టీఆర్ బావామ‌రిదితో సినిమాలు చేయడానికి కన్ఫామ్ చేసుకున్నాయి. ఇలా టాలీవుడ్ లో ఉన్న బడా ప్రొడక్షన్ హౌస్‌లు గా ఉన్న మూడింటిలో సినిమాలు చేయడానికి నార్నె నితిన్ ఇప్పటికే కమిట్ అయ్యాడు. ఇప్పుడు మరో పెద్ద బ్యానర్ లో నాలుగో మూవీని కూడా కన్ఫామ్ చేశాడు. అయితే ఇది అఫీషియల్ గా ఏ బ్యానర్లో అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

భారీ బడ్జెట్ తోనే ఈ మూవీని ప్లాన్ చేయబోతున్నారట. ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ బావమ‌రిది అనే బ్రాండ్ తో నార్నె నితిన్ పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లో మూవీస్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇక నితిన్ హీరోగా పరిచయం అవడానికి తండ్రి నార్నె శ్రీనివాస్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారట. ఇదే సమయంలో టాలీవుడ్ లో ఇప్పటికే నితిన్ పేరుతో సక్సెస్ఫుల్గా స్టార్‌ హీరోగా కొనసాగుతున్న మరో హీరో ఉన్నాడు. నార్నె నితిన్ కూడా అదే పేరుతో కొనసాగుతాడా.. లేదంటే మరో పేరు మార్చుకుంటారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.