నటి పవిత్రా లోకేష్ – సీనియర్ నటుడు నరేష్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరు గత రెండేళ్ల నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అసలు వీరు కలిసి ఉన్నప్పటి నుంచి వార్తలు మామూలుగా ఉండడం లేదు. లేటు వయస్సులో వీరి ప్రేమ… ఇక పెళ్లి వార్తలు… వీరిద్దరు కలిసి నటించిన మళ్లీపెళ్లి సినిమా ఇలా ఏదైనా కూడా వార్తల్లో నిలుస్తూనే వస్తోంది.
వీరిద్దరు కలిసి చేసిన మళ్లీపెళ్లి సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయినా కూడా థియేటర్లలో అయితే ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కాని… ఓటీటీలో మాత్రం దూసుకుపోయింది. కొద్ది రోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో కాస్త తక్కువుగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి ఈ జంట వార్తల్లో కెక్కడంతో పాటు వైరల్ అవుతున్నారు.
తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఈ జంటపై చేసిన కామెంట్లతో వీరు వార్తల్లోకెక్కారు. ప్రస్తుతం వినయాకచవితి సీజన్ స్టార్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే వినాయక చవితి అనే ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో హైపర్ ఆది నరేష్‌పై ఫన్నీ కామెంట్స్ చేశారు. పెళ్లి, మళ్లీ పెళ్లి ఎలా సార్ ? అని హైపర్ ఆది ప్రశ్న వేశాడు.
అయితే నరేష్‌కు కాస్త కోపం వచ్చినట్టు ఉన్నా పక్కనే పవిత్రా లోకేష్ కూడా ఉండడంతో నవ్వుతూ అలాగే ఉండిపోయాడు. ప్రోమో కాబట్టి టోటల్ ఏం జరిగిందన్నది రివీల్ చేయలేదు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం అనవసరంగా హైపర్ ఆది కాంట్రవర్సీ డైలాగులతో కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని చూస్తూ.. అయిపోయిన విషయాన్ని మళ్లీ తేనెతుట్టెలా కదుపుతున్నాడంటూ ఫైర్ అవుతున్నారు.