ఇండ‌స్ట్రీలో విషాదం: గుండెపోటుతో స్టార్ హీరో భార్య మృతి..!

ప్రముఖ కన్నడ యాక్టర్ విజయ రాఘవేంద్ర ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. విజయ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. ఆమెకు హార్ట్ ఎటాక్ రావడంతో వెంటనే అక్కడి దగ్గరలో ఉన్న స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటు ఈ రోజు ఉదయం స్పందన చివరి శ్వాస విడిచినట్లు సమాచారం.

కాగా విజయ రాఘవేంద్ర 2007లో స్పందనను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. విజయ రాఘవేంద్ర ప్రస్తుతం ఆయన నటించిన సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉండడంతో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. ఆయన బెంగుళూరులో ఉన్నట్లుగా తెలుస్లుంది. స్పందన మరణ వార్త విన్న‌ కుటుంబ సభ్యులు వెంట‌నే బ్యాంకాక్‌కి బయలుదేరారట.

కన్నడ కంఠ‌రీవ‌ రాజకుమార్ మేనల్లుడు విజయ రాఘవేంద్ర చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా, దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. 2016లో రవిచంద్రన్ అపూర్వ చిత్రంలో విజయ రాఘవేంద్ర తో పాటు తన భార్య స్పందన కూడా నటించింది. స్పందన రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ బి కే శివరం కూతురు.