చిరంజీవి కోసం12 ఏళ్లు పోరాటం చేసి వాళ్ల‌ను జైలుకు పంపా… అల్లు అర‌వింద్ కామెంట్స్ వైర‌ల్‌..!

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన భోళా శంకర్ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, అక్కినేని సుశాంత్ కీరోల్‌ ప్లే చేశారు. ఈ సినిమా ఆగస్ట్‌ 11న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈవెంట్లో పాల్గొన్న‌ అల్లు అరవింద్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వివరించాడు.

ఎన్నో పెద్ద పెద్ద సినిమాలతో హిట్స్ తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి గారికి భోళా శంకర్ సినిమాకు సక్సెస్ కావాలని ప్రత్యేకంగా విష్ చేయను.. మీరంతా ఆయన సినిమాలను చూసి పెరిగితే నేను ఆ సినిమాలను చేస్తూ పెరిగాను.. చిరు పై నాకు ఎంత అభిమానం ఉందో చెప్పనవసరం లేదు. ఆయన చేసిన కొన్ని మంచి పనుల గురించి నీచంగా మాట్లాడుతూ ఒకరు ఆరోపణల చేశారు. వారి పై 12 ఏళ్ల నుంచి పోరాడి మరీ వారిని జైలుకు పంపించేంతవరకు వదల్లేదు అంటూ చిరంజీవి పై ఉన్న అభిమానాన్ని ఇలా వివరించాడు అల్లు అరవింద్.

మెహర్ రమేష్ ఎంతో మంచివాడని.. కీర్తి సురేష్ ఆమె నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఇంతమంది మంచివారు ఈ సినిమాలో న‌టించిన‌ప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అలాగే సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అరవింద్ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 11న భోళా శంకర్ సినిమా రిలీజ్ అవుతుండగా ఆగస్ట్ 10న జైలర్ సినిమాతో రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వీరిద్దరి మధ్యన గట్టి పోటీ ఉండబోతుంది. చిరంజీవి ఈ సినిమాతో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాడో చూడాలి.