‘ వార్ 2 ‘లో ఎన్టీఆర్ విల‌న్ రోల్ ఇంత ప‌వ‌ర్‌ఫుల్‌గానా… హృతిక్‌ను మించి..!

త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ సాధించిన తర్వాత ఎన్టీఆర్ ‘ దేవర ‘ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ” వార్ 2 ” సినిమాలో నటించబోతున్నాడు ఎన్టీఆర్. సౌత్, నార్త్ స్టార్ హీరోల కలయికలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది.

ఈ మల్టీ స్టార‌ర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించబోతుంది. వారిద్ద‌రిలో కియారా ఎవ‌రి స‌ర‌స‌న నటించబోతుందో చూడాలి. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ ప్లే చేయబోతున్నాడట‌. ఎన్టీఆర్ విలన్ రోల్‌లో హృతిక్ ను మించి పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడట.

ఇందులో హృతిక్ రోషన్ కు ఎన్టీఆర్‌కి మధ్యన ఎంతో ఆసక్తికరమైన యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో విల‌న్ రోల్ ప్లే చేయ‌డానికి ఎన్టీఆర్ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు డైరెక్టర్ అయన్ ముఖర్జీ వివరించాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ‘ జై లవకుశ ‘ సినిమాలో జై పాత్రలో నెగిటివ్ షెడ్ ని చూపించాడు. ఈ సినిమాలో తన నటనతో బీభత్సవం సృష్టించిన ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాడు చూడాలి.