BiggBoss : బిగ్ బాస్ లో ఆ టాప్ యాంకర్.. భారీ రెమ్యునరేషన్..!

బిగ్ బాస్ సీజన్ 6 రంగం సిద్ధమైంది. లేటెస్ట్ గా బిగ్ బాస్ (BiggBoss ) సీజన్ 6 ప్రోమోతో వచ్చేశాడు కింగ్ నాగార్జున. ముందు సీజన్లు కన్నా ఎక్కువ ఎంటర్టైనింగ్ గా ఈ సీజన్ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 6లో ఒకప్పటి టాప్ యాంకర్ ఉదయభాను వస్తుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె కూడా డైరెక్ట్ గా వెళ్తున్నానని చెప్పలేదు కాబట్టి అలాంటిది ఏమి లేదని అనేసింది. కానీ బిగ్ బాస్ నుంచి వస్తున్న లీక్స్ ప్రకారం సీజన్ 6లో ఉదయభాను వన్ ఆఫ్ ది కంటెస్టంట్ గా ఉంటుందట.

ఒకప్పుడు స్టార్ యాంకర్ గా సత్తా చాటిన ఉదయభాను పెళ్లి తర్వాత యాంకరింగ్ కి దూరంగా ఉంది. అయితే ఈమధ్య మళ్లీ తను కొన్ని షోస్ చేస్తుంది. తిరిగి కెరియర్ లో మళ్లీ ఊపందుకోవాలని చూస్తుంది ఉదయభాను. అందుకే బిగ్ బాస్ షోకి వస్తుందని తెలుస్తుంది. అయితే ఈ షోకి వస్తున్నందుకు గాను ఉదయభానుకి బిగ్ బాస్ టీం భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిందట.

దాదాపు BiggBoss సీజన్ 6లో అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టంట్ గా ఉదయభాను టాప్ ప్లేస్ లో ఉంటుందని తెలుస్తుంది. ఎలాగు ఉదయభానుకి ఉన్న క్రేజ్ వల్ల ఆమె 100 రోజులు హౌజ్ లో ఉంటుంది. ఆమె ఆట తీరు బాగుంటే టైటిల్ గెలిచినా గెలవొచ్చు. సో బిగ్ బాస్ వల్ల ఉదయభాను భారీగా లాభ పడే అవకాశం ఉంది.

Tags: Anchor Udayabhanu, BiggBoss 6, BiggBoss Season 6, BiggBoss Telugu, nagarjuna, Top Anchor, Udayabhanu