కోలీవుడ్ లో సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతుంది. స్టార్ హీరో సూర్య.. స్టార్ డైరక్టర్ బాలా కలిసి అచలుడు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్ గా నటిస్తుంది. బాలా సినిమాలు అంటేనే రియలిస్టిక్ గా ఉంటాయి. ఈ సినిమా కూడా అంతే ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఒక సీన్ లో సెమీ న్యూడ్ గా కూడా కనిపిస్తుందని తెలుస్తుంది.
తమిళంలో తన టాలెంట్ తో మెప్పిస్తున్న ఐశ్వర్య రాజేష్ ఇప్పటివరకు తన అభినయంతో మెప్పించింది. అయితే కెరియర్ లో నిలదొక్కుకోవాలంటే మాత్రం కేవలం నటన ఒక్కటే సరిపోదు ఆడియెన్స్ ని అలరించాలంటే గ్లామర్ షో కూడా చేయాల్సిందే. ఈ క్రమంలో Aishwarya Rajesh కూడా అందుకు రెడీ అంటుంది. సూర్య సినిమాలో ఆమె సెమీ న్యూడ్ గా నటించిందని తెలుస్తుంది.
ఇదే కాదు ఇక మీదట తను కూడా గ్లామర్ రోల్స్ కి రెడీ అంటుంది. లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ కూడా చేస్తానని అయితే అవి సినిమాకు అవసరం అనిపిస్తే తప్పకుండా చేస్తానని అంటుంది ఐశ్వర్య రాజేష్.