Hanu : అయ్యో పాపం హను ఇలా బుక్కయ్యాడేంటి.. సీతారామం డైరక్టర్ ని ఆడేసుకుంటున్న నెటిజెన్లు..!

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం సినిమా ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి మెప్పు పొందిన విషయం తెలిసిందే. ఆ సినిమా చూసిన ప్రతి ఆడియెన్ సినిమా సూపర్ అనేస్తున్నారు. అయితే ఆడియెన్స్ తమ సినిమాపై చూపిస్తున్న ప్రేమకి బదులుగా సీతారామం చిత్రయూనిట్ కూడా డిజిటల్ లెటర్స్ రాస్తున్నారు. తన నిర్మాణ సంస్థలో తెరకెక్కిన సీతారామం సినిమాపై వస్తున్న రెస్పాన్స్ చూసి నిర్మాత అశ్వనిదత్ అద్భుతమైన మెసేజ్ అందించారు.

ఇక ఈ సినిమా హీరో దుల్కర్ సల్మాన్ కూడా తెలుగు ఆడియెన్స్ తన మీద చూపిస్తున్న ప్రేమకి ఓపెన్ లెటర్ రాశాడు. ఇక వీరి మార్గంలోనే సీతారామం డైరక్టర్ హను రాఘవపుడి (Hanu) కూడా ఓ లెటర్ రాసుకొచ్చాడు. డిజిటల్ లెటర్ రూపంలో వచ్చిన హను లెటర్ లో చాలా తప్పులు ఉన్నాయి. సీతారామం లాంటి సూపర్ హిట్ సినిమా అద్భుతమైన క్లాసిక్ సినిమా తీసి ఇలా ఆడియెన్స్ కి కృతజ్ఞత తెలుపుతూ రాసిన లెటర్ లో తప్పులు రాయడం చూసి హనుని ఆడియెన్స్ ఆడేసుకుంటున్నారు.

అయితే చేతి రాత అయితే తప్పు తను రాశాడు అనుకోవచ్చు. డిజిటల్ రైటింగ్ కాబట్టి తాను ఒకటి అనుకుంటే అక్కడ మరొకటి పడి ఉండొచ్చు. అయినా సరే ప్రేక్షకులకు రాసే లెటర్ కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. మొత్తానికి క్లాసిక్ సినిమా తీసిన డైరక్టర్ Hanu ఇలా ఆడియెన్స్ లెటర్ లో ఇలా తప్పులు రాయడం అందరికి షాక్ ఇచ్చింది.

అయితే కొద్ది క్షణాల్లోనే తన మిస్టేక్స్ ని గుర్తించిన హను వెంటనే అదే లెటర్ ని తప్పులు లేకుండా మార్చి పెట్టాడు. పాత లెటర్ ని డిలీట్ చేశాడు. అయితే అది అప్పటికే చాలామంది చూసేశారు.

Tags: Aswanidatt, Dulquer Salman, Hanu Raghavapudi, Mrunal Thakur, Rashmika Mandanna, Sitharamam, vyjayanthi movies