ఎన్టీఆర్ ‘ దేవ‌ర‌ ‘ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసిందోచ్..పెద్ద స‌ముద్ర‌పు దొంగ చంపేశాడ్రా స్టిల్‌

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన‌ తర్వాత వ‌స్తోంది. దీంతో ఈ సినిమాపై పాన్ ఇండియా లెవ‌ల్లోల భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆచార్య లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత కొరటాల తీస్తోన్న సినిమా కావడంతో కొరటాల ఆశలు కూడా భారీగానే ఉన్నాయి.

NTR 30 | NTR 30: First look and title of Jr NTR's upcoming film to be  unveiled today - Telegraph India

ఈ సినిమా సముద్ర నేపథ్యంలో రాబోతుంది. జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌లో చీరకట్టులో నడుము చూపిస్తూ కాళ్లు కనపడేలా సముద్రం ఒడ్డున వెనుక తిరిగి చూస్తోంది. జాన్వీ ఫస్ట్ లుక్ సముద్రం ఒడ్డున స్టిల్ కావడంతో ఈ సినిమా సముద్ర నేపథ్యంలో వస్తుందని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ 30 స్టిల్స్‌, పోస్టర్స్‌కు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాగా కొంతసేప‌టి క్రితం ఎన్టీఆర్ దేవ‌ర‌ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ అదిరే లుక్‌లో కనిపించారు. స‌ముద్ర‌పు ఒడ్డున ఎగ‌సిప‌డే కెర‌టాల్లో క్రూరంగా క‌నిపిస్తున్నాడు. చేతిలో చివ‌ర ర‌క్తంతో ఉన్న బ‌ల్లెం ప‌ట్టుకుని… విల‌న్ల కోసం వెంటాడే మ‌గ‌ధీరుడిలా ఉన్నాడు. లుక్ అయితే చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంది. టైటిల్ విష‌యంలో ముందునుంచి అనుకున్న‌ట్టుగానే దేవ‌ర క‌న్‌ఫార్మ్ చేశారు. స్టిల్ అయితే చంపేశాడ‌నే చెప్పాలి.

ఈ 30 ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు స్కై రేంజ్‌కు వెళ్లిపోయాయి. యువ‌సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ బ్యానర్ల‌పై మిక్కిలినేని సుధాకర్ – నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ మ్యూజిక్ ఇస్తున్నారు.