గవర్నర్ రాజ్‌భవన్ మెనూ నుంచి టమాటో మాయం… అబ్బా ఏం రీజ‌న్ రా బాబు..!

ప్రథమ పౌరుడు కి కూడా చుక్కలు చూపిస్తుంది ఓ కూర‌గాయ‌. మన ఇంటి వంటగది నుంచే కాదు… గవర్నర్ కిచెన్ నుంచి కూడా మాయం అయిపోయింది. రోజురోజుకు పెరిగిపోతున్న టమాటా ధరతో విసిగిపోయిన ఆ రాష్ట్ర గవర్నర్ తమ తినే ఆహారం మెనూ మార్చేసుకున్నారు. అంత పెట్టి కొనేది లేదని తెగించి చెప్పేశారు. టమోటాలు వంటగది నుంచి తొలగించబడ్డాయి. పంజాబ్ లో ఏకంగా టమోటాలు ధర రూ. 200 కి చేరింది. ఇది మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

ప్రజలందరూ టమాటాల స్థానంలో మరో వంటకం బెస్ట్ అని నిర్ణయించుకున్నారు. టమాటో రేటు మోత మోగిస్తూనే ఉంది. సామాన్యుడి నుంచి ప్రధమ పౌరుడు వరకు టమోటో ధర చుక్కలు చూపిస్తుంది. సామాన్యుడు ఇంటి నుంచే కాదు గవర్నర్ ఇంటి నుంచి కూడా టమాటా వెలివేశారు. రాజభవన్ ఇచ్చిన ఓ ప్రకటన ప్రకారం పంజాబ్ గవర్నర్ భ‌న్మర్‌లాల్ పురోత్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం అధిపతిగా కూడా చేస్తున్నారు.

పెరుగుతున్న టమోటో ధరలు ప్రభావాలను అనుభవిస్తున్న పంజాబ్ నివాసితులకు మద్దతుగా టమాటా వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించాలని నిర్ణయించుకున్నారు. టమోటా ని నిలిపివేస్తే లేదా తగ్గించడం ద్వారా దీన్ని ధరపై ప్రభావం చూపిస్తుంది. డిమాండ్ తగ్గడం వల్ల‌ ధర ఆటోమేటిక్గా తగ్గుతుంది. పంజాబ్ ప్రజలు ప్రస్తుతానికి టమాటో వాడడం లేదు. ఇది ముందుగా గవర్నర్ నుంచే మొదలైనట్టు తెలుస్తుంది.

మరోవైపు ఉత్తర ప్రదేశ్ మహిళా అభివృద్ధి శిశు పోషకాహారం శాఖ సహాయ మంత్రి ప్రతిభ శుక్లాగత నెలలో టమాటాలను ఇంట్లోనే పండించండి.. లేదా వాటి ధరలను నియంత్రించడానికి వాటిని తినడం మానేయ‌మ‌ని సలహా ఇవ్వడంతో తుఫాన్ గా మారింది. ట‌మోటా బదులుగా నిమ్మకాయని తినొచ్చు…. ఎవరు టమోటా కొనకండి.. కూరగాయలు ఏ ఆహారానికి అయితే ఎక్కువ ధర ఉంటుందో దానిని నిలిపివేయండి.. అప్పుడు తప్పకుండా ధర కచ్చితంగా తగ్గుతుంది అని మంత్రి వెల్లడించాడు.