రజనీకాంత్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రోల్… ఆ స్టార్ ఎవ‌రంటే…!

ఎవరైనా ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడడానికి ఫ్యాన్స్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఒక హీరో చిత్రంలో మరో హీరో గెస్ట్ రోల్ చేసినా… లేదా ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమా చేసినా…. ఆ సినిమాకు వచ్చే రేంజ్ మామూలుగా ఉండదు. ఒకప్పుడు గెస్ట్ రోల్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ గత కొన్నేళ్లలో ఒక హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్ అనేది చాలా వరకు తగ్గిపోయాయి.

బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటినుండో కొనసాగుతున్న టాలీవుడ్ లో మాత్రం ఈ కాన్సెప్ట్ అరుదుగానే కనిపిస్తూ ఉంటది. తాజాగా నాచురల్ స్టార్ నాని కూడా ఒక స్టార్ హీరో చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్లి తన సత్తాని చాటుకున్నాడు నాచురల్ స్టార్ ఎవరికి తెలియని స్థాయి నుంచి అందరిని మెప్పించే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం నాని పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశాడు.

నాని నటించిన సినిమాలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇప్పుడు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. తెలుగులో తనకున్న పాపులారిటీని ఇతర భాషల్లో కూడా తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నాని చివరగా దసరా లో నటించాడు ఇది తెలుగులో హిట్ అయింది కానీ…. ఇతర భాషల్లో మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. తాజాగా కోలీవుడ్‌ నుంచి ఒక అదిరిపోయే ఆఫర్ నానిని వెతుక్కుంటూ వచ్చిందట.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమాలో నాని గెస్ట్ రోల్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి వార్తలు ఎన్నో వినిపించాయి. కానీ ఈసారి నాని కూడా ఈ ఆఫర్ కి ఓకే చెప్పాడంటూ వార్తలు వినిపించడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే మాకు ఇంకేం కావాలంటున్నారు అభిమానులు. జై భీమ్ దర్శకుడు టీజీ జ్ఞానవేళ్ళతో రజనీకాంత్ ఒక సినిమా చేయబోతున్నాడని ఆ సినిమాలో నానికి కీలక పాత్ర ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.