అపర్ణ చాలా మాటలు అంటుంటే… చివరికి ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటుంది. అంతలోగా రాజ్ వాళ్ళ తాత వచ్చి చాలు ఆపండి అని గట్టిగా అరిచి తనకు నచ్చినట్టు చేస్తుంది. కావ్య మన పరువుఏమి తీయడం లేదు కాపాడుతుంది.. అని చెబుతాడు. ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను కావ్యకు నచ్చినట్టు చేస్తుంది అని చెబుతాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కావ్య వచ్చి తాతగారు మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు థాంక్స్ అని అంటుంది. కనకం ఇల్లు అమ్మేస్తే కావ్య ఇంకెప్పటికీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు కదా అని అనుకుంటారు.
రాజ్- కావ్య కోసం పడుకోవడానికి పరుపు వేస్తూ ఉంటాడు కావ్య వచ్చి నా పరుపు నేను తీసుకోగలను అని అంటుంది. రాజ్ నువ్వు పరుపు తీసుకుంటావు ఇంటి పరువు తీస్తావు అని అంటాడు. కావ్య అంత పరువు తీసే పని నేనేం చేశాను అని అంటుంది. రాజ్ కావ్యాన్ని ఇకమీదట మీ పుట్టింటికి వెళ్లడానికి వీల్లేదు అంటాడు.సరే వెళ్ళను అంటుంది కావ్య. రాజ్ నిజంగా వెళ్ళవా అంటాడు నిజంగానే వెళ్ళను అని అంటుంది కావ్య. ఇంత త్వరగా ఒప్పుకుంది ఏంటి అని రాజ్ మనసులో అనుకుంటాడు.
కావ్య నీ నిద్ర లేపబోయి రాజ్ కావ్య పక్కన పడతాడు. ఇంతలో కావ్య లేచి ఏంటి… అని అడుగుతుంది. రాజ్ ఇది కల ఒకసారి కళ్ళు మూసుకొ నేను వెళ్ళిపోతాను చూడు అంటాడు. కావ్య కళ్ళు మూసుకుంటేనే కదా కలవచ్చేది అని చెప్పి రాజ్‌ని గిల్లుతుంది. కావ్య అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడతారా అంటుంది. రాజ్ ఒకటి అడగాలని నీ పరుపు మీదకు వచ్చాను అంటాడు. ఇంతలోనే కావ్య అమ్మో తాతయ్యగారు, మామగారు అని పిలుస్తుంది. రాజ్ ఆపు అని చెప్పి నేను ఒక విషయం అడగాలి అంటాడు ఏంటి చెప్పండి అంటే నువ్వు ఇంత త్వరగా ఎలా ఒప్పుకున్నావు అని అడుగుతాడు రాజ్. ఈ విషయం గురించా మీరు నన్ను నిద్ర లేపింది అని చెప్పి పడుకుంటుంది కావ్య.
అలా తెల్లారిన తర్వాత కావ్య తాతగారు ఇంకా మా ఇంటికి వెళ్ళమనడం లేదేంటి అని చూస్తుంది. ఇంతలోగా రాజ్ వస్తాడు రాజ్ చేతిలో పేపర్ లాగేసుకుని వాళ్ళ తాత గారికి ఇచ్చి తాతగారు బుక్ ని రాజకీచ్చి ఇది చదవండి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది అంటుంది. కావ్య వాళ్ళ బామ్మ గారు నాకు కూడా నీలాంటి కూతురు ఉంటే ఎంత బాగుంటుందో అని అంటుంది. ఇంతలో కావ్య వాళ్ళ పుట్టింటికి వెళ్లడానికి ఆటో బుక్ చేసుకుంటూ ఉంటుంది ఇది చూసి కావ్య వాళ్ళ తాతగారు ఎందుకమ్మా నువ్వు ఆటో బుక్ చేసుకుంటున్నావు మన ఇంట్లో ఇన్ని కార్లు ఉన్నాయి కదా అని చెప్పి…. ఈరోజు నుంచి నిన్ను రాజ్ దింపుతాడని చెబుతాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.