త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మాస్కా దాస్.. ఇంత‌కీ అమ్మాయి ఎవరంటే..?

హీరో విశ్వక్‌సేన్ సినిమాల కంటే కాంట్రవర్సీలతో ఎక్కువగా పాపులర్ అయ్యాడు. ఇటీవల విశ్వక్ ఫాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలియజేశాడు. విశ్వక్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వివరించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకాలం నన్ను అభిమానించీ ఆదరించిన అభిమానులందరికీ ధన్యవాదాలు.

మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి జీవితంలో మరో స్టెప్ ముందుకు వేయబోతున్నాను అని విశ్వక్సేన్ అ నోట్లో రాసుకోవచ్చాడు. నేను కొత్త జీవితాన్నీ ప్రారంభించబోతున్నాను అని ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. దీంతో విశ్వక్ తను పెళ్లి చేసుకోబోతున్నానని వివరించినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. విశ్వక్ మాత్రం ఎక్కడ తన వివాహం చేసుకోబోతున్నట్లు వివరించలేదు.

కొత్త కుటుంబాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నాను అని వెల్లడించాడు పూర్తి విషయాలు త్వరలో చెప్తాను అంటూ ఆ నోట్లో మెన్షన్ చేశాడు. కాబట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని జనాలు ఫిక్స్ అయ్యారు. దీంతో విశ్వక్‌కి ఇప్ప‌టినుంచే విషెస్ తెలియజేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం 28 ఏళ్ల వయసు ఉన్న విశ్వక్సేన్ 2017లో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు.