పూర్వకాలంలో ఎక్కువగా కట్టుల పొయ్యి మీదే వంట చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో గ్యాస్ పొయ్య మీదే వండుతున్నారు. అయితే మన ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులో మాత్రమే ఉంటుంది. అసలు ఇవి ఎరుపు రంగులో ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులో ఉండడానికి అసలు కారణం గ్యాస్ సిలిండర్లో మండే వాయువు ఉంటుంది.
ఇది చాలా ప్రమాదకరం. వినియోగదారుల భద్రతను ఆలోచించి సిలిండర్లను ఎరుపు రంగులో ఉంచుతారంట. ఎందుకంటే ఎరుపు రంగు ప్రమాదానికి సూచిక అంతేకాకుండా దీన్ని ఎంత దూరంలో ఉన్న ఈజీగా గుర్తించవచ్చు. అందుకే యజమాన్యులు గ్యాస్ సిలిండర్‌ను ఎరుపు రంగులో తయారు చేశారట.