తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ యంగ్‌ డైరెక్ట‌ర్లు వీళ్లే…!

తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు చేసే విధానం కొత్త కొత్త పుంతలు తొక్కుతుంది.. అందులో భాగంగానే ఎన్నో వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి.. ఎందరో యంగ్ దర్శకులు తమ సినిమాలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలా కొత్త కొత్త ఆలోచనలతో ఇండస్ట్రీకి వచ్చి మొదటి సినిమాతోనే విజయం అందుకున్న డైరెక్టర్స్ ఎవరో ఒకసారి చూద్దాం.

Telugu Bimbisara, Chandu Mondeti, Dasara, Sudheer Varma, Vasisth Malladi, Karthi

ప్రస్తుత జనరేషన్‌లో ఉన్న దర్శకులలో మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్న దర్శకులలో ముందుగా విల‌క్ష‌ణ‌ దర్శకుడు చందు మొండేటి ఒకరు.. నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్లో కార్తికేయ 2 సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌లో బంపర్ హిట్ కొట్టాడు.

 Tollywood Directors Chandu Mondeti Sudheer Varma Srikanth Odela Super Hit First-TeluguStop.com

ఈ దర్శకుడు తర్వాత మరో యంగ్ దర్శకుడు సుధీర్ వర్మ గురించి చెప్పాలి.. ఈ దర్శకుడు కూడా స్వామి రారా అనే ఓ సరికొత్త కథతో తొలి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్నాడు. ఈయన తర్వాత మల్లిడి వశిష్ట కూడా బింబిసారా సినిమాతో తొలి అడుగుతోనే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కి బంపర్ హిట్ ఇచ్చాడు. రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు శ్రీకాంత్ కూడా తన మొదటి సినిమాతోనే పాన్‌ ఇండియా లెవల్‌ లో సూపర్ హిట్‌ అందుకున్నాడు.

Telugu Bimbisara, Chandu Mondeti, Dasara, Sudheer Varma, Vasisth Malladi, Karthi

అదేవిధంగా విరూపాక్ష సినిమాతో కార్తీక్ వర్మ అనే నూతన దర్శకుడు కూడా సాయి ధరమ్ తేజ్‌కు సూపర్ హిట్ ఇచ్చాడు. అలా వీరే కాకుండా ఇండస్ట్రీలో చాలామంది కొత్త దర్శకులు మొదటి సినిమాతోనే మంచి విజయాలు అందుకున్నారు. అలా వీరే కాకుండా వివేక్ ఆత్రేయ, వెంకటేష్ మహా లాంటి ఎందరో టాలెంటెడ్ డైరెక్టర్లు కూడా సినిమాలు తీసి మంచి విజయాలు అందుకున్నారు.