ఈ పెద్ద ఆంటీ ఒక‌ప్పుడు గోపీచంద్ ల‌వ‌ర్‌ అని మీకు తెలుసా…!

తొలివలపు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగు పెట్టాడు గోపీచంద్. ఈ సినిమా తరువాత జయం, నిజం, వర్షం, యజ్ఞం వంటి సినిమాలలో విలన్ రోల్ లో ఆకట్టుకున్నాడు గోపీచంద్. యజ్ఞం, రణం, శౌర్యం, శంఖం వంటి సూపర్ హిట్ సినిమాలు హీరోగా నటించాడు. అయితే ఆ పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకప్పుడు గోపీచంద్ నటించిన సూపర్ హిట్ సినిమాలో లవర్ గా నటించిందని మీకు తెలుసా..?

Sameera Banerjee

గోపీచంద్ కు మంచి పేరు సంపాదించి పెట్టిన సినిమాలలో యజ్ఞం సినిమా ఒకటి. ఏఎస్‌. ర‌వికుమార్ చౌద‌రి ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో గోపీ చంద్ లవర్ గా నటించిన సమీరా బెనర్జీనే ఆపై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్. తెలుగు ఇండస్ట్రీలో యజ్ఞం సినిమా మంచి గుర్తింపు తెచ్చినా ఆ సినిమా తర్వాత ఛాన్సులు రాకపోవడంతో సమీరా టాలీవుడ్ కి దూరమైంది.

ఒకప్పుడు స్టార్ హీరో తో నటించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం అవకాశాలు లేక.... |  Yagnam movie fame Sameera Banerjee real life news, Sameera Banerjee, Telugu  heroine, Yagnam movie, Gopi Chand, Tollywood ...

ఆమె ఆ తర్వాత బాలీవుడ్ లో చాలా సీరియల్స్ లో నటించి సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. చెష్మి బాదుర్ అనే సీరియల్ ద్వారా 1998లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన సమీరా వరుసగా 25 కు పైగా సీరియల్స్ లో నటించింది. తర్వాత సీరియల్స్ కి నిర్మాతగా వహిస్తున్న నీరజ్ శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

వారి ఇద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. యజ్ఞం సినిమాలో శైలజ పాత్రలో నటించి తెలుగు ఇండస్ట్రీని ఆకట్టుకున్న సమీరా ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా ఆంటీలా మారిపోయింది. ఈ ఫోటో చూసిన నెటిజ‌న్స్ అస‌లు ఈమె స‌మీరానా అంటూ ఆమె రూపం చూసి షాక్ అవుతున్నారు.