చిరంజీవికి ఉన్న చివరి కోరిక.. రామ్ చరణ్ నెరవేర్చగలుగుతాడా..!

తెలుగు చిత్ర పరిశ్రమంలో స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి అగ్ర హీరోగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటాడు. చిరంజీవి తర్వాత ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎందరో హీరోలు చిరంజీవి వేసిన బాటలో హీరోలగా పరిచయమై రాణిస్తున్నారు. చిరంజీవి నటవరసుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ కొడుకుగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇది ఎలా ఉంచితే చిరంజీవికి ఒక చివరి కోరిక ఉందట. అది కూడా తన కొడుకు రామ్ చరణ్ నెరవేర్చుతాడో లేదో అన్న టెన్ష‌న్ అయితే చిరు మనసులో ఉంద‌ట‌. ఇంతకీ చిరంజీవి చివరి కోరిక‌ ఏంటో ? ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించారు.. తన కొడుకు రామ్ చరణ్ తో కూడా కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఇక గత సంవత్సరమే ఆచార్య సినిమాలో తన కొడుకు రామ్ చరణ్‌తో కలిసి చిరంజీవి నటించాడు.

రీసెంట్ గా చిరంజీవికి ఉన్న చివరి కోరిక కూడా బయటపడింది. అదేమిటంటే చిరు, రామ్ చరణ్ కి పుట్టబోయే బిడ్డతో కూడా కలిసి ఒక సినిమాలో నటించాలని కోరిక ఉందట. ఈ కోరిక తాను ఉన్న‌ప్పుడే నెరవేరాలని చిరంజీవి భావిస్తున్నాడట. మరి తన తండ్రి కోరికను రామ్ చరణ్ ఎంతవరకు నెరవేర్చుతాడో చూడాలి. ఎందుకంటే వారికి పుట్టబోయే బిడ్డను సినిమాల్లోకి తీసుకు వస్తాడో లేదో అనేది రామ్ చరణ్ దంప‌తుల నిర్ణ‌యం.

ఒకవేళ రామ్ చరణ్ తన బిడ్డను సినిమాలలోకి తీసుకురాకూడదు అనుకుంటే మాత్రం చిరంజీవి చివరి కోరిక తీరకుండానే ఉంటుంది. ఇక మరి రామ్ చరణ్ తన తండ్రి చివరి కోరికను తీర్చడానికి తన వారసత్వాన్ని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకువస్తాడు లేదో తెలియాలంటే చూడాలి. బ‌న్నీ కూతురు అల్లు అర్హ శాకుంత‌లం సినిమాతో వెండితెరంగ్రేటం చేసిన సంగ‌తి తెలిసిందే.