క్యూట్‌గా ఉన్న ఈ బుల్లి గ్రాడ్యుయేట్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌… ఎవ‌రో గుర్తు ప‌ట్టారా…!

ఇటీవల కాలంలో నటీనటులు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో అందరికీ తెలుసు. అలాగే వారి పర్సనల్ విషయాలు, సినిమా విష‌యాల‌తో పాటు వాళ్ల చిన్ననాటి ఫోటోలను షేర్ చేసుకుంటూ వాటి మెమోరీస్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. నెటిజన్స్ కూడా ఇలాంటి పోస్టులపై ఆసక్తి చూపడంతో వాళ్ళ‌ చైల్డ్ హుడ్ ఫొటోస్, హ‌ట్ ఫోటోషూట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుల్లి వ‌య‌స్సులో ఉన్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Introducing Samyuktha Menon as 'Vyjayanthi' in Bimbisara | Nandamuri Kalyan  Ram | In theatres Aug5th - YouTube

ఆ న‌టి ఎవ‌రో కాదు సంయుక్త మీన‌న్‌. 2016లో మలయాళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె తెలుగు, తమిళ్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. 2022లో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించినా అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో గోల్డెన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ మంచి క్రేజ్ తో కొనసాగుతుంది.

Dhanush's Telugu-Tamil bilingual 'SIR/Vaathi', directed by Venky Atluri,  1st single to be out on November 10th | Telugu Movie News - Times of India

ఇటీవల రిలీజ్ అయిన విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సంయుక్త ముందుగా టాలీవుడ్‌లో భీమ్లా నాయక్ సినిమాలో రానాకు భార్యగా చిన్న పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బింబిసారా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో ఆ సినిమా ద్వారా సూపర్ హిట్ సాధించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

Virupaksha Telugu Movie Review

ధ‌నుష్ హీరోగా నటించిన సార్ సినిమా ఎంత సూపర్ హిట్. ఇందులో సంయుక్త హీరోయిన్‌గా నటించింది. ఇటీవల కాలంలో విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్స్ కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.