పెళ్లైన హీరోతో ప్రేమాయ‌ణం న‌డిపిన స్నేహ‌… సినిమా ఛాన్సుల కోసం ఇంత ప‌ని చేసిందా…?

తెలుగు ఇండస్ట్రీ లోకి తొలివల‌పు సినిమా ద్వారా అడుగుపెట్టిన స్నేహ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె అందం, అభినయంతో ఎంతోమంది అభిమానాని సంపాదించుకుంది స్నేహ. తనదైన స్టైల్ లో కథలను ఎంచుకుంటూ.. కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలతో ఎంతోమంది తెలుగు కుటుంబ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. స్నేహ నటించిన తెలుగు సినిమాల్లో సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు సినిమాలు ఎంతోమంది ప్రేక్షకులను అలరించాయి.

స్నేహ కెరియర్ స్టార్టింగ్ లో సినిమా ఛాన్సులు ఎక్కువగా వస్తాయన్న ఆశ‌తో పెళ్లి అయినా ఒక స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిందట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. సవ్యసాచి సినిమాలో ప్రతి నాయకుడుగా నటించిన మాధవన్. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా ఐదు భాషలకు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మాధవన్ యాక్టర్ గానే కాక ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

మాధవన్ కు సరిత బీర్జా అనే అమ్మాయితో పెళ్లి అయిన తరువాత కూడా మళ్లీ హీరోయిన్ స్నేహతో ప్రేమలో పడ్డాడట. మాధవన్ – స్నేహ కాంబినేషన్లో ఎన్నవల్లే అనే తమిళ సినిమా వచ్చింది. ఈ సినిమా టైంలో వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిఫ్‌ ఏర్పడింది. కానీ అప్పటికే మాధవన్‌కి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయ్యాక కూడా స్నేహతో ప్రేమలో పడ్డాడట మాధవన్. ఇన్నవల్లే అనే సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా పర్వతం.

Sneha and Prasanna conduct an important family function photos go viral -  Tamil News - IndiaGlitz.com

ఈ సినిమా టైంలో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారట. అప్పట్లో ఈ న్యూస్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దీంతో మాధవన్ – స్నేహ మధ్య ప్రేమ భార్య సరితకు తెలియడంతో సరిత స్నేహకు గట్టి వార్నింగ్ ఇచ్చిందట. అప్పట్లో స్నేహ ఛాన్సులు ఎక్కువగా వస్తాయని ఉద్దేశంతో మాధవన్ ను ప్రేమ పేరుతో దగ్గరైంద‌ని… మాధవన్ భార్య వార్నింగ్ ఇవ్వడంతో మాధవన్ ని దూరం పెట్టి బ్రేకప్ చెప్పిందంటూ వార్తలు వినిపించాయి.

Actress Sneha News in Malayalam Latest Actress Sneha news, photos, videos |  Zee News Malayalam

అప్పటినుంచి స్నేహ – మాధవన్ ప్రేమాయణం ముగిసిందట. అయితే తర్వాత స్నేహ అచ్చేముందు సినిమాతో ప్రసన్న స్నేహకు జోడీగా నటించారు. అప్పటినుంచి వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది దాంతో 11 మే 2012లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.