వేశ్య పాత్ర‌ల‌తో దుమ్ము రేపిన టాప్ – 10 హీరోయిన్లు వీళ్లే…!

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సాంప్రదాయమైన పాత్రలో నటిస్తూనే మంచి గుర్తింపు తెచ్చుకునేవారు. అప్పట్లో హీరోయిన్స్ కంటే హీరోస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు హీరోస్ తో పోటీ పోటీగా హీరోయిన్స్ నటిస్తున్నారు. తమకు మంచి గుర్తింపు వస్తుంది అనిపిస్తే ఎటువంటి రోల్స్ చేయడానికి అయినా ఓకే చేసేస్తున్నారు.

సమాజంలో వేశ్యలు అంటే అందరికీ చిన్న చూపు ఉంటుంది. వీరి గురించి కూడా కొన్ని సినిమాలు తెరకెక్కాయి. వేశ్యలా కొంత మంది స్టార్ హీరోయిన్స్ కూడా నటించి ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా వేశ్య‌ పాత్రలో నటించిన స్టార్ హీరోయిన్‌లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.

అనుష్క శెట్టి :
సూపర్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనుష్క స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని మంచి ఫామ్ లో ఉన్న టైం లో వేదం సినిమాలో వేశ్య‌ గా నటించింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా అనుష్కకు మంచి గుర్తింపు వచ్చింది.

అనసూయ :
జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ తర్వాత సినిమాల్లో కూడా నటిస్తుంది. పాన్ ఇండియా సినిమా పుష్పాలో కూడా నటించింది. అనసూయ సముద్రఖ‌ని కీరోల్‌ ప్లే చేసిన విమానం సినిమాలో వేశ్య‌ పాత్రలో నటించి మెప్పించింది. ఆమె తర్వాత ప్రాజెక్టులో ఆమె వేశ్య పాత్రలో కనిపించబోతుందట.

శ్రేయ :
ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో దశాబ్దాలు అయినాఆ ఇంకా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. శ్రేయ కూడా పవిత్ర అనే సినిమాలో వేశ్య పాత్రలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

శృతిహాసన్ :
ప్రస్తుతం స్టార్ హీరోల‌ సరసన నటిస్తూ మంచి ఫామ్ లో దూసుకుపోతున్న శృతిహాసన్ బాలీవుడ్ మూవీ డిడే లో వేసే పాత్రలో నటించింది. ఇందులో పాకిస్తాన్ కు చెందిన వేశ్య గా ఈమె కనిపించింది.

రమ్యకృష్ణ :
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన‌ రమ్యకృష్ణ ప్రస్తుతం కూడా క్యారెక్టర్ అర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. రమ్యకృష్ణ కూడా సూపర్ డీలక్స్ మూవీలో వేశ్య‌ పాత్రలో తన నటనతో అదరగొట్టింది.

సంగీత :
ఇండ‌స్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సంగీత. ప్రస్తుతం బుల్లితెరపై పలు ఫోల‌లో సందడి చేస్తుంది. ఈమె ధనం మూవీ లో వేశ్య‌గా నటించి మెప్పించింది.

ఛార్మి :
ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఛార్మి తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో పలు సినిమాలుకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. ఈమె జ్యోతిలక్ష్మి సినిమాలో వేశ్యగా నటించింది.

స్నేహ :
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ పాత్రలోనే నటించే స్నేహ కూడా వేశ్య‌ పాత్రలో నటించింది. దూల్ పేట అనే సినిమాలో వేశ్య‌ పాత్రలో ఈమె కనిపించింది.

సదా :
క్లాస్ హీరోయిన్ మార్క్ సంపాదించుకున్న సదా ముద్దుగుమ్మ టార్చ్ లైట్ మూవీ లో వేశ్య‌గా కనిపించి మెప్పించింది.

బిందు మాధవి :
ఆవకాయ బిర్యానీ మూవీ బాలీవుడ్ లో అడుగుపెట్టిన బిగ్ బాస్‌ టైటిల్ కొట్టేసిన బిందు మాధవి కూడా సెగ సినిమాలో వేశ్య‌ రోల్ ప్లే చేసింది.

ప్రేమ‌:
సీనియ‌ర్ హీరోయిన్ ప్రేమ కూడా ఏ సినిమాలో వేశ్య‌గా క‌నిపించింది.