రాజమౌళి ఈగ‌ సినిమాలో విలన్ పాత్రను వదులుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే..!?

మన తెలుగు చిత్ర పరిశ్రమకు వన్నెతెచ్చిన నేటితరం దర్శకులలో దర్శక ధీరుడు రాజమౌళి ముందు వరుసలో ఉంటాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 11కు పైగా సినిమాలు తెరకెక్కించగా వాటిలో ఒక్కటంటే ఒక్క ప్లాప్ సినిమా కూడా లేదు. వచ్చిన ప్రతి సినిమా ఒక్క సినిమాకు మించి మరో సినిమా ఉంటుంది. అలాంటి రాజమౌళి ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లాడు.

ఇక గత ఏడాది వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు. ప్రస్తుతం తన తర్వాత సినిమాను మహేష్ బాబుతో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమాలలో ఈగ కూడా ఒకటి.. నాచురల్ స్టార్ నాని, స్టార్ హీరోయిన్ సమంత అలాగే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విలన్ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా మొత్తం సమంత ఈగ, విలన్ సుదీప్ చుట్టూనే తిరుగుతుంది.

ముఖ్యంగా ఈ సినిమాలో సమంత ఈగతో వచ్చే సీన్‌లు ఎంతో హైల‌ట్‌గా ఉంటాయి. అయితే రాజమౌళి ముందుగా విలన్ గా సుదీప్ పాత్ర కి మరో టాలీవుడ్ స్టార్ హీరోని ఎంచుకున్నారట.ఆ హీరో డేట్స్ కుదరకపోవడంతో రాజమౌళితో మరో సినిమా చేయలేకపోయాడు. ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ. మీరు వింటున్నది నిజమే రవితేజని ఈ సినిమాలో విలన్ గా పెట్టి సినిమా చేయాలని రాజమౌళి భావించారట.

కానీ అప్పటికే రవితేజ ఇతర సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండటం కారణంగా సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో రవితేజ బ‌దులు కన్నడ హీరో సుదీప్ ను తీసుకొని విలన్ పాత్ర చేయించారు. త‌ర్వాత సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు సుదీప్ కి టాలీవుడ్ లో ఎన్నో క్రేజీ ఆఫర్లు కూడా వచ్చాయని చెప్పవచ్చు. ఈ విధంగా రవితేజ- రాజమౌళితో రెండో సినిమాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయాడు.