ప్రశాంతతకు పెట్టిన పేరు కాకినాడ అని అంటారు. ఒకవైపు సముద్రం… మరోవైపు గోదావరి పొంగుతూ కాకినాడ విరజల్లుతుంది. అందుకే కాకినాడలో సెటిల్ అవ్వాలని చాలా గ్రామాల ప్రజలు అనుకుంటారు. అందుకు కారణం విద్య, వైద్యం పరంగా కాకినాడలో ప్రముఖ సంస్థలే ఉన్నాయి. మరోవైపు పారిశ్రామికంగా కూడా పేరు సంపాదించింది కాకినాడ. అలాంటి కాకినాడలో ఫుడ్ బీట్ చేసే ప్రాంతాలు దగ్గరలో ఏమీ లేవు. ఇక్కడ మాంసప్రియలు కూడా ఎక్కువే. ముఖ్యంగా సముద్రంలో పట్టే చేపలకు ఫిదా అయిపోతూ ఉంటారు. అలాంటి కాకినాడలో మరో మాంసాహారం మాంస ప్రియులకు వరంగా మారింది.
అతి తక్కువ ధరతో కాకినాడలో నిర్వహించే చీకెన్ దుకాణం ఎంతో ఫేమస్. కాకినాడ జెన్ టియా రోడ్ లో ఈ షాప్ ఉంటుంది. నిత్యం వందలాదిగా జనాలు ఉంటారు. భగభగ మండే నిప్పులపై చికెన్ కాల్చి ఇస్తారు. రాజు అనే యువకుడు నిర్వాహంలో పండు చికెన్ చీకుల దుకాణం నడుస్తుంది. మండుతున్న బొగ్గు నిప్పులపై చికెన్ ఆ పుల్లకు గుచ్చి బాగా కాల్చి దానిమీద ఘాటుగా కారం వేసి నిమ్మకాయ పిండి ఇస్తాడు దానితో జనాలందరూ ఫిదా అయిపోతారు. అందుకే చికెన్ ప్రియులు ఇక్కడకు వచ్చి 6 నుంచి 8 చికెన్ చీకులు తింటారు.
చాలాకాలంగా జెన్ టియూ రోడ్ లో వినాయక కేఫ్ పక్కన పండు చికెన్ దుకాణం దిగ్విజయంగా నిర్వహించుకున్నాడు. ప్రతిరోజు నాలుగు గంటల నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి. చికెన్ చీకులు లో టమాటా సాస్, ఉల్లిపాయలు, నిమ్మ బద్ద వేసి ఇస్తాడు. దీని ధర ఒక్కోటి రూ.20 ఎక్కువగా ఫంక్షన్స్ కూడా అందజేస్తా ఉంటాడు. ఇందులో చికెన్ కంగనకాయ, గుండెకాయ తో పాటు, లివర్ను కూడా నిప్పులపై కాల్చి విడిగా ఇస్తాడు. ఎంత తిన్నా తక్కువగానే ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈ షాప్ ఎల్లప్పుడు కలకలలాడుతూ ఉంటుంది.