‘ ద‌స‌రా ‘ ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ క‌లెక్ష‌న్లు… టాలీవుడ్‌ను షేక్ చేసిన నాని..!

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా దసరా. నాని కెరీర్ లోనే అత్యధికంగా రు. 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిన్న శ్రీరామనవమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణకు చెందిన కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెర్కెక్కించిన ఈ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కు అదిరిపోయే హిట్ టాక్ వచ్చింది. కానీ తన కెరీర్లో ఏ ?సినిమాకు కష్టపడిన విధంగా ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు.

ఇక సినిమా రిలీజ్‌కు వారం పది రోజుల ముందు నుంచే పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా నార్త్ ఇండియాలో పలు థియేటర్లలో రిలీజ్ చేసినప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు అంతా నాని తన కెరీర్ లోనే అదిరిపోయే ఊర మాస్ పాత్రలో నటించాడు అంటూ ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు. దసరా సినిమాకు తొలి రోజు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా రూ. 25 కోట్ల గ్రాస్ వ‌సుళ్ళు రాగా.. రూ. 14 కోట్ల షేర్ వచ్చింది.

నాని కెరీర్ లోనే ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్‌ రికార్డుగా నిలిచింది. ఇక స్టార్ హీరోలను పక్కనపెట్టి టాలీవుడ్ లో ఉన్న టైర్‌ 2 హీరోలలో ఇది ఆల్ టైం రికార్డు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మిడిల్ రేంజ్ హీరోలలో ఏ హీరో సినిమాకు కూడా తొలి రోజు రూ. 25 కోట్ల గ్రాస్, రూ. 14 కోట్ల షేర్ ఇప్పటివరకు రాలేదు. ఇక నైజాంలో అయితే తొలి రోజు ఏకంగా రూ 6.77 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇది నిజంగా చాలామంది పెద్ద హీరోలకు కూడా ఇప్పటివరకు సాధ్యం కాలేదు.

Dasara ने तोड़े बॉक्स ऑफिस कलेक्शन के सारे रिकॉर्ड, जानिए कितने करोड़ कमाए!  | Dasara Box Office Collection in Hindi - Bhola Box Office Collection

ఏదేమైనా దసరా సాధించిన విజయం చూసి.. తొలిరోజు వసూళ్ల దెబ్బతో టోటల్ టాలీవుడ్ షేక్ అయిపోతుంది. అటు ఓవర్సీస్ లో తొలిరోజు ప్రీమియర్లతో కలుపుకుని రూ. 8 లక్షల 50వేల డాలర్ల వసూళ్లు దక్కించుకుంది. రెండో రోజుకే ఈ సినిమా అక్కడ చాలా సింపుల్గా మిగిలిన డాలర్ల వసూళ్లు క్రాస్ చేస్తుందని అంటున్నారు. లాంగ్ లో దసరా సినిమా సరికొత్త రికార్డులు లిఖించటం ఖాయంగా కనిపిస్తోంది.

Tags: Dasara Movie, Dasara Movie collections, filmy updates, intresting news, latest viral news, Nani, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news