ఆ పాత టీడీపీ నేత‌కు జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి… పెద్ద బ్లండ‌ర్ మిస్టేక్ ఇదే…!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కోసారి ఏం నిర్ణయాలు ? తీసుకుంటున్నారో వైసీపీ వాళ్లకే అర్థం కావడం లేదు. అసలు జగన్ తీసుకునే నిర్ణయాలు అర్థం కాక జగన్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నవాళ్లు, ఆ పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు కూడా తలలు ప‌ట్టుకుంటున్నారు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోతున్న జగన్ వారి గోడు పట్టించుకోవడం లేదు.

Thota Trimurthulu, పార్టీ మారను.. టీడీపీలో కొనసాగుతా: తోట త్రిమూర్తులు -  tdp mla thota trimurthulu respond on party change rumors - Samayam Telugu

అసలు కోటంరెడ్డి జగన్‌కు పెద్ద భక్తుడు. అలాంటి నేతే చివరకు జగన్ పై విమర్శలు చేసి పార్టీ నుంచి బయటికి వచ్చారంటే.. పార్టీ కోసం జగన్ కోసం ముందు నుంచి కష్టపడి త్యాగాలు చేసిన వారికి విలువలేదని అర్థమవుతుంది. తాజాగా జగన్ తీసుకోబోయే మరో నిర్ణయం ఇప్పుడు పార్టీ వర్గాల్లో కలకలం రేపుతుంది. పార్టీ నేతలు మండిపోయేలా చేస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో జగన్ తన క్యాబినెట్లో పలు చేర్పులు చేసేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

పనితీరు సరిగా లేని ఇద్దరు, ముగ్గురు మంత్రులను పక్కన పెట్టేసి వారి స్థానాలలో కొత్తవారిని తీసుకోబోతున్నారంటూ ఇప్పటికే లీకులు వచ్చేసాయి. ఈ క్రమంలోనే కోనసీమ జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులను జగన్ తన కేబినెట్లోకి తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. తోట త్రిమూర్తులు ఇప్పటికే మూడు, నాలుగు పార్టీలు మారారు. గత ఎన్నికలలోను ఆయన రామచంద్రపురం నుంచి టీడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

అయితే ఆయన వియ్యంకుడు.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీలో ఉండడంతో ఆయన పట్టుబట్టి మరి తోటను వైసీపీలోకి తీసుకువచ్చారు. పార్టీలోకి వచ్చిన వెంటనే తోటకు కోనసీమ జిల్లా పార్టీ పగ్గాలతో పాటు మండపేట ఇన్చార్జి పదవి, అలాగే ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబట్టేశారు. పార్టీ కోసం ఎప్పటినుంచో కష్టపడుతున్న నేతలను కాదని తోటకు ఒకేసారి మూడు పదవులు ఇవ్వడం పార్టీలో పెద్ద మంట పెట్టేసింది.

ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించాలి అంటే తోటకు మంత్రి పదవి ఇవ్వాలని, అలాగే గోదావరి జిల్లాలలో పవన్ జనసేనకు బ్రేకులు వేయాలంటే కాపు సామాజిక వర్గంలో ప‌ట్టున్న తోటను క్యాబినెట్లోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. తోటకు నిజంగా కాపుల్లో అంత పట్టు ఉంటే గత ఎన్నికల్లో ఆయన ఎందుకు ఓడిపోయారని ? నిజంగా ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇస్తే అంతకన్నా దారుణం ఉండదని.. వైసిపి కోసం, జగన్ కోసం త్యాగాలు చేసిన వారికి.. కష్టపడిన వారికి అన్యాయం చేసినట్లు అవుతుందన్న భావన వైసిపి వర్గాల్లో ఉంది. మరి జగన్ డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి.

Thota Trimurthulu Slams On Chandrababu In East Godavari - Sakshi

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp