అసలే 2019 ఏడాది ఈ టాప్‌హీరోకు కలిసిరాలేదు. తాను నటించిన ఏ సినిమా హిట్ కాదు కదా.. కనీసం పట్టుమని ఐదు రోజులు కూడా ముందుకు సాగలేదు. అంతలా ఈ హీరో నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్లతో బొల్తా పడ్డాయి. అయితే ఈ భారీ డిజాస్టర్ నుంచి బయటపడేందుకు ఓమార్గం ఎంచుకున్నాడు.. ఎవ్వరికి చెప్పాచేయకుండా సైలెంగ్ ఓ సినిమాను పూర్తి చేసుకునే పనిలో నిమగ్నమయ్యాడు ఈ టాప్ హీరో. అంతే కాదు ఈ సినిమాలో తాను గెస్ట్‌గా నటిస్తుండటం విశేషం.
మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ ఓ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఈ సినిమాలో ఓ ఫవర్‌పుల్ ఫోలీసాఫీసరు పాత్రలో ఓ అగ్ర హీరో నటించబోతున్నాడు అనే వార్త చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఇంతకు సైలెంట్‌గా సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఈ అగ్రహీరో ఎవరు.. ఇంతకు తాను ఎందుకు గెస్ట్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర ఎంత నిడివి ఉంటుంది. అంటే ఈ హీరో ఇక ముందు ఇలా గెస్ట్ పాత్రలకే పరిమితమవుతాడా అనే సందేహాలు కలుగుతున్నాయి.
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున. ఈ అగ్రహీరో ఇప్పుడు అతిథి పాత్రలు పోషిస్తున్నాడు. అది కూడా ఓ ఫవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించబోతున్నాడు. ఇప్పటికే మన్మథుడు 2తో భారీ డిజాస్టర్ అందుకున్న నాగార్జున ఇప్పుడు గెస్ట్ రోల్‌లో కేవలం 20నిమిషాల పాత్రలో నటించడం ఏమిటబ్బా అని అంతటా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సోలోమన్ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సోలోమన్ వాస్తవానికి ఓ రచయిత. ఇప్పుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. అయితే ఈ రచయిత కమ్ దర్శకుడు అయిన సోలోమన్ సినిమాలో ఓ గెస్ట్‌గా నటించడంలో అంతర్యమేమిటో ఎవ్వరికి బోధ పడటం లేదు. అసలు నాగార్జున ఎత్తుగడ ఏమిటి.. ఎందుకు ఇలా అతిధి పాత్ర పోషిస్తున్నాడు.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటికి రావడం లేదు. ఈ సినిమాలో హీరో ఎవ్వరు.. కథ ఏమిటీ.. ప్రాజెక్ట్ ఏమిటి అనేవి ఇంకా తెలియకున్నా నాగార్జున మాత్రం ఓల్డ్ సిటిలో ఐదు రోజుల షూటింగ్ లో పాల్గొని తన పాత్రను పూర్తి చేసుకున్నాడు.