టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు. టాలీవుడ్ సూపర్‌స్టార్ గా ప్రేక్షకుల నిరాజనాలు అందుకుంటున్న ఈ హీరో.. ఓ విషయంలో మాత్రం అభిమానుల నుంచి ఎప్పటికి నెగిటివ్ మార్క్‌లే సంపాదిస్తాడు. ఈ సూపర్‌స్టార్ సినిమా విడుదల అయిన ప్రతిసారి అభిమానులకు నచ్చని ఈ విషయంలో ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడని టాక్. తనకు ప్రతికూలంగా మారుతున్న ఈ విషయంలో రెచ్చిపోయి అభిమానులకు కనువిందు చేయబోతున్నాడు.
ఇంతకు సూపర్‌స్టార్ మహేష్‌బాబును ఏ విషయంలో అభిమానులు ఒప్పుకోవడం లేదు. ఏ విషయంలో మహేష్‌బాబుకు ప్రతికూలంగా ఉంది. దాని నుంచి ఎలా బయటపడబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం మహేష్‌బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ. ఈ సినిమా లో ప్రిన్స్ మహేష్‌బాబు తనకు సరిజోడిగా అందాల నటి రష్మీక మందన్న నటిస్తుంది. అయితే మహేష్ బాబు ఏ సినిమాలో నటించినా అభిమానులకు నచ్చనిది ఆయన డ్యాన్స్. మహేష్‌బాబు డ్యాన్స్ చేయలేడు అనేది లోకోక్తి. అయితే ఇప్పుడు తాను నటిస్తున్న ఈ సినిమాలో మాత్రం తన డ్యాన్స్‌తో రచ్చరచ్చ చేయబోతున్నాడని టాక్.
రౌడీ హీరోయిన్ రష్మీకతో మహేష్‌బాబు డ్యాన్స్‌తో రచ్చరంబోలా చేయబోతున్నాడని ఫిలింవర్గాల టాక్. మైండ్ బ్లాంక్ పాటలోనూ, తమన్నాతో వచ్చే ఐటెమ్ సాంగ్‌లోనూ, అదే విధంగా రష్మీకతో వచ్చే పాటల్లోనూ, మిలటరీ ఫేర్ వెల్ పార్టీలోనూ తన డ్యాన్స్‌తో అదరగొట్టబోతున్నాడని.. ఇది అభిమానులకు తీపి కబురే అని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. 2020 జనవరి 11న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై రోజుకో అప్‌డేట్ బయటకు వస్తున్నాయి. సో ఈ సినిమాతోనైనా అనిల్ రావిపూడి మహేష్‌బాబు మీదున్న అపప్రదను తొలగిస్తాడో లేదో సంక్రాంతికి తేలిపోనున్నది.