హీరోల మధ్య గతంలో పోటీ వాతావరణం ఎక్కువగా ఉండేది. నందమూరి మెగా కుటుంబాల మధ్య ఈ పోటీ గతంలో తీవ్రంగా ఉండేది. దీనితో మెగా ఫ్యామిలీ అభిమానులు నందమూరి సినిమాలను, నందమూరి సినిమాలను మెగా అభిమానులు చూసే వారు కాదు. హీరోల మధ్య స్నేహం ఎలా ఉన్నా సరే వాళ్ళ మధ్య సఖ్యత లేదనే ప్రచారం ఎక్కువగా జరిగేది. అందుకే మల్టీ స్టారర్ సినిమాలను కూడా హీరోలు వదులుకునే వారని, అవకాశాలు వచ్చినా నిర్మాతలు ముందుకి వచ్చినా సరే వాళ్ళు సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించలేదు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వరకు కూడా ఈ తరం హీరోలు మల్టీ స్టారర్ సినిమాలను చేయలేదు. ఇక ఇప్పుడు వసూళ్ళ కోసం హీరోలు గతం మర్చిపోయే పరిస్థితి ఉంది. హీరోల మధ్య విభేదాలు ఎలా ఉన్నాయో తెలియదు గాని, అభిమానులు మాత్రం దూరంగా ఉండే వారు. వాళ్ళ మధ్య వైరం కూడా ఉండేది. ఇప్పుడు వాళ్ళను మర్చిపోయి కొంత మంది హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇది ఒకరకంగా మంచి వాతావరణమే అయినా కొంత మందికి మాత్రం రుచించడం లేదు.
కొంత మంది హీరోలు, ఇతర హీరోలతో నిర్మాతలుగా మారి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం వసూళ్లు. గతంలో కంటే వసూళ్లు భారీగా పెరిగాయి. వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నారు నిర్మాతలు. దీనితో కలిసి ఉంటె కలదు సుఖం అని భావిస్తున్నారు హీరోలు. అందుకే గతాన్ని మర్చిపోయి మరీ సినిమాలు చేయడానికి సిద్దమైపోతున్నారు. త్వరలోనే మహేష్ బాబు అల్లు అర్జున్ కలిసి ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.