సైరా సినిమా విడుదల అయ్యే సమయంలో చాలా మంది అంచనాలు, చిరంజీవి జాతీయ స్థాయిలో పాపులర్ అవ్వడమే ఆలస్యం అని భావించారు. ఆ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్ తో రూపొందించడం తో అభిమానుల్లో ఆ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే అనూహ్యంగా ఆ సినిమా ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. మెగా అభిమానులనే ఆ సినిమా ఆకట్టుకోలేదు అనే ఆరోపణలు వచ్చాయి. వసూళ్లు కూడా పెద్దగా రాకపోవడంతో నిర్మాత రామ్ చరణ్ కి నష్టాలు వచ్చాయని,
ఆయన సినిమాలు నిర్మించాలి అంటే భయపడుతున్నారు అనే ప్రచారం జరిగింది. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొంధకపోవడంతో, తాను తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా విషయంలో సీరియస్ గా ఉన్నారట చిరంజీవి. వాస్తవానికి ఈ సినిమాను తెలుగుకి మాత్రమె పరిమితం చెయ్యాలని భావించారు కొరటాల. అయితే తన మార్కెట్ ని పెంచుకోవాలని భావిస్తున్న చిరంజీవి, పాన్ ఇండియా స్థాయిలో ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చెయ్యాలని సూచించారట.
నిర్మాతకు కూడా ఈ విషయాన్ని చిరు చెప్పినట్టు సమాచారం. సినిమా సబ్జెక్ట్ యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దేవాలయాల నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాలో, దేవాలయాలను సంరక్షించే ఉద్యోగి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారట. కాబట్టి ఉత్తరభారతంలో, దేవాలయాలు ఎక్కువగా ఉండే తమిళనాడులో ఈ సినిమా విజయం సాధిస్తుందని చిరంజీవి భావిస్తున్నారట. అందుకే ఈ సినిమాని అన్ని భాషల్లో విడుదల చెయ్యాలని చెప్పారట.