నందమూరి మెగా కుటుంబాల మధ్య పోటీ అంటే చాలు ఒక స్థాయిలో హైప్ ఉంటుంది. ఈ రెండు కుటుంబాల నుంచి ఏదైనా పండగకు ఒకేసారి సినిమా విడుదల అవుతుంది అంటే బాక్సాఫీస్ వద్ద జరిగే మార్కెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక అభిమానుల్లో పందాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పండగల సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఒకరికి పోటీగా మరొకరు బ్యానేర్లు కడుతూ సందడి చేస్తూ ఉంటారు. ఇక మొక్కులు చెల్లించుకునే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది అభిమానుల్లో.
అయితే గత మూడేళ్ళ నుంచి మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ చేతిలో వరుసగా దెబ్బ తింటూనే ఉంటుంది. ప్రధానంగా బాలకృష్ణ చేతిలో ఎక్కువగా దెబ్బలు మెగా ఫ్యామిలీకి తగిలాయి అనే చెప్పవచ్చు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురు కూడా బాలయ్య చేతిలో షాక్ కి గురైన వారే. 2017 లో చిరంజీవి, 2018 లో పవన్ కళ్యాణ్, 2019 లో రామ్ చరణ్ ఇలా ముగ్గురికి షాక్ ఇచ్చారు బాలకృష్ణ. దీనితో ఇప్పుడు మెగా ఫ్యామిలీ బాలయ్య సినిమాల సమయంలో తమ సినిమా విడుదల చేయవద్దని భావిస్తుంది.
బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న బోయపాటి సినిమాను వేసవిలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ సినిమా దాదాపు మే లో విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనితో చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాను ఏప్రిల్ లో లేదా జూలై లో విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాను కూడా దసరా కి విడుదల చేసే విధంగానే ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ మాత్రం తన సినిమాలు తాను సైలెంట్ గా చేసుకుంటూ మెగా ఫ్యామిలీకి ఊహించని విధంగా షాకులు ఇస్తున్నారు.