టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో రకరకాల ఆరోపణలు చూపి నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు చంద్రబాబు – భువనేశ్వరి దంపతులకు పెళ్లిరోజు కావటం విశేషం. 1981 సెప్టెంబర్ 10న చెన్నైలోని వారి వివాహం జరిగింది.
ఎన్టీఆర్ తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసే సరికే ఆయన మంత్రిగా ఉన్నారు. 1978లో చంద్రగిరి నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి కూడా దక్కింది. ఇక ఈ దంపతులకు లోకేష్ జన్మించగా… లోకేష్ తిరిగి తన మేనమామ కుమార్తె బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణిని వివాహ మాడారు.
ఇక పెళ్లి రోజుకు ఒక్కరోజు ముందు కావాలని ఆయన్ను అరెస్టు చేసినట్టు అయింది. ఇక ఈ కేసులో చంద్రబాబు స్వయంగా తన వాదనలు వినిపిస్తున్నారు. ఇక చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లోద్ర వాదనలు వినిపిస్తున్నారు. 49 సెక్షన్ ఈ కేసులో పెట్టడం సరికాదని… ఈ కేసు పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చెప్పాలని ఆయన వాదించారు.