చంద్ర‌బాబు అరెస్టుపై ప‌వ‌న్ సీరియ‌స్‌… వీడియోతో వార్నింగ్‌..

మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును ఈరోజు ఉదయం నంద్యాలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుపై ఏపీ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. ఎక్కడకక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా చంద్రబాబును అరెస్టు చేసిన తీరును ఖండిస్తున్నారు.

ఇప్పటికే సిపిఐ రామకృష్ణతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి సైతం ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అరెస్ట్ ఖండించారు. పవన్ కళ్యాణ్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ వైసిపి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో అవలంబిస్తున్నారు అంటూ పవన్ మండిపడ్డారు.

లాండర్ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది పోలీసులు అయితే వైసీపీకి ఏం సంబంధం ? అని ఆయన ప్రశ్నించారు. నాయకుడు అరెస్టు అయితే కార్యకర్తలు.. అభిమానులు బయటకులు రావడం నిరసనలో భాగం వారిని బయటికి రావద్దని కంట్రోల్ చేస్తుంటే ఇది కక్ష సాధింపు చర్య అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.