మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు పెళ్లయిన 11 సంవత్సరాల కు ఇటీవల ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాప పుట్టిన తర్వాత ఉయ్యాల వేడుకలు ఘనంగా జరుపుకొని క్లిన్‌కారా అనే పేరు పెట్టారు. ఇక మనవరాలి రాకతో చిరంజీవి – సురేఖ మురిసిపోయారు. అభిమానులు కూడా సెలబ్రేషన్లలో మునిగితేలారు. రామ్ చరణ్ కూతురు ఎప్పుడైతే మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టిందో అప్పటినుంచి అన్ని శుభాలే జరుడుతున్నాయని మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా బాగా నమ్ముతున్నారు.
ఉపాసన ప్రెగ్నెంట్ అయిన తరువాతనే వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి ఫిక్స్ అవడం, రాంచరణ్ కు ఆస్కార్ అవార్డు రావడం, గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగాయని.. ఈ శుభశకునాలన్నిటికీ కారణం పాప అడుగు పెట్టడమే అంటూ తెగ మురిసిపోతున్నారు. ఇక తాజాగా అమ్మగా ప్రమోషన్ పొందిన ఉపాసన తొలిసారిగా కూతురితో కలిసి పుట్టింటికి వెళ్ళింది.అక్కడ ఆమె తల్లి కామినేని శోభన మనవరాలిని ఇన్వైట్ చేసేందుకు చేసిన పని చూసి చాలామంది షాక్ అవుతున్నారు.
తన మనవరాలిని ఇంట్లోకి అడుగుపెట్టే ముందు పని వాళ్ళతో దిష్టి తీయించిన శోభన వారికి ఏకంగా రూ.10 లక్షల బహుమానం ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా దిష్టి తీసినందుకు వంద లేదా వెయ్యి రూపాయలను ఇస్తారు. అలాంటిది మనవరాలు క్లిన్‌కారా కి దిష్టి తీసిన పనివాళ్ళకు రూ.10 లక్షల రూపాయలు ఇవ్వడంతో పనివాళ్ళు సంబరం చేసుకుంటున్నారట.
ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవడంతోమనవరాలి రాకతో కామినేని శోభన పని వాళ్లకు మంచి బహుమతి ఇచ్చిందంటూ చాలామంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.