ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయోః భారం సమస్యలతో ఉన్న ఆయన కోలుకుంటున్నట్టు కనిపించిన కొద్ది రోజులకే మృతిచెందడం బాధాకరం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గద్దర్‌ను వారం రోజుల క్రితమే ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇక గద్దర్ మృతి సందర్భంగా పలువురు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.